జాతీయ వార్తలు

వెనక్కితగ్గను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: ‘తెలంగాణ పోలీసులు బోగస్ ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్ ద్వారా ముస్లిం యువతను మతోన్మాదులుగా మారుస్తున్నారన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం నాపై కేసు పెడితే సుప్రీంకోర్టులో పోరాడుతా’ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు బోగస్ ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్ పెట్టారనేందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని దిగ్విజయ్ మంగళవారం తనను కలిసిన మీడియాకు
వెల్లడించారు. ఈ విషయంపై తాను పలువురితో చర్చించిన తరువాతే వ్యాఖ్యలు చేశానని అన్నారు. పోలీసులు ఇలా చేయటం మంచిదికాదని పలువురు ఏటిఎస్ అధికారులు కౌంటర్ టెర్రరిజం సమావేశంలో అభిప్రాయపడ్డారని చెప్పారు. తెలంగాణ పోలీసుల విధానం సరైంది కాదన్నారు. పోలీసులు బోగస్ ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్లు పెట్టటం వలన ముస్లిం యువత అటువైపు ఆకర్షితులు అవుతున్నారన్నారు. మతోన్మాదులైన ముస్లిం యువతకు ఎరవేసి పట్టుకోవటం ఏవిధమైన విధానం, దీనివల్ల మరింతమంది మతోన్మాదం వైపు ఆకర్షితులు అవుతున్నారని వ్యాఖ్యానించారు. మీ ఆరోపణలను డిజిపి ఖండించారన్న ప్రశ్నకు తాను బాధ్యతతోనే వ్యాఖ్యలు చేశానన్నారు. కాన్పూర్‌లో సైఫుల్లా ఎన్‌కౌంటర్, మధ్యప్రదేశ్ రైలులో బాంబు పేలుడు సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి ఎలా అందిందని దిగ్విజయ్ ప్రశ్నించారు. ముస్లిం యువతను మతోన్మాదం వైపు ఆకర్షితులను చేసి, వారు ఏదైనా చర్యకు పాల్పడగానే వారి ఫోటోలతో సమాచారం పంపించటమేమిటి? అని దిగ్విజయ్ ప్రశ్నించారు. బోగస్ ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్‌ను పెట్టటంపై దర్యాప్తు జరపాలన్నారు. తెలంగాణ పోలీసులు కేసు పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని, ఎక్కడ కేసు పెట్టినా హాజరవుతానని అన్నారు. సుప్రీంకోర్టు వరకు పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. తన ట్వీట్ల వలన పోలీసుల నైతిక పటిమ దెబ్బ తింటోందని అనటం సబబు కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యూహం మంచిది కాదని కౌంటర్ టెర్రరిజం సమావేశానికి హాజరైన పలువురు అధికారులు అభిప్రాయపడటంతోపాటు, వ్యూహాన్ని గట్టిగా వ్యతిరేకించారని చెప్పారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆచూకీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం తప్పుకాదు కదా? అని ఒక విలేఖరి సూచించగా, అలాగైతే తాను చేసిన ఆరోపణలు నిజమవుతాయని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.