జాతీయ వార్తలు

సుప్రీం జడ్జిలకు కర్నన్ ఎన్‌బిడబ్ల్యు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/కోల్‌కతా, మే 2:సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు న్యాయమూర్తులకు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్నన్ మంగళవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి సరికొత్త సంచలనానికి తెరతీశారు.తాను ఆదేశించినట్టుగా వీరందరూ తన ముందు హాజరు కానందుకే ఈ వారెంట్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. సుప్రీం కోర్టుకు చెందిన ఏడుగురు న్యాయమూర్తుల గైర్హాజరీ కారణంగా వారికి ఎన్‌బిడబ్ల్యులు జారీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని కర్నన్ ఆదేశించారు. ఈ వారెంట్లను ఢిల్లీ డిజిపి లేదా పోలీసు కమిషనర్ వారికి అందజేయాలని స్పష్టం చేశారు. అవినీతి, అశాంతి నుంచి దేశ ప్రజలకు ఉపశపనం కలిగించే ఉద్దేశంతోనే తాను తనంతట తానుగా రాజ్యాంగంలోని 226 అధికరణ, నేర శిక్షాస్మృతిలోని 482 సెక్షన్ల ఈ ఉత్తర్వును జారీ చేస్తున్నానని తెలిపారు. ‘నేను ఏడుగు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్ని హాజరు కావాలని ఆదేశించా. అలాంటిదేమీ జరుగలేదు. వీరికి ఎన్‌బిడబ్ల్యులు జారీ చేయండి’అని కర్నన్ తన ఉత్తర్వులో రిజిస్ట్రీని ఆదేశించారు. కాగా, సుప్రీం కోర్టు ఆదేశించినట్టుగా కర్నన్ వైద్య పరీక్షలు చేయించుకుంటారా లేదా అన్నది అనుమానమేనని అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ సుప్రీం కోర్టుకు నివేదించారు.