జాతీయ వార్తలు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి ‘సుప్రీం’ ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 2: ఉమ్మడి ఏపి ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను అభివృద్ధి చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే తుదితీర్పు వెలువడేంతవరకు స్థలాలలో నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. శాసన సభ్యులు, సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇళ్లస్థలాల మంజూరుకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టులోని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నాజిర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మూడు వర్గాలకు అప్పటి ఉమ్మడి ఏపి ప్రభుత్వం మొత్త 6 సొసైటీలకు వివిధ జీవోల ద్వారా స్థలాలను కేటాయించింది. జర్నలిస్టులకు సంబంధించిన జవహర్‌లాల్ జర్నలిస్టు మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మినహా మిగిలిన ఐదు సొసైటీలు తమకు కేటాయించిన ఆ స్థలాలను స్వాధీనంలోకి తీసుకున్నాయి. జర్నలిస్టులకు సంబంధించిన స్థలాలను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని జర్నలిస్టుల సొసైటీ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తును ధర్మాసనం విచారణ జరిపి సొసైటీ అభివృద్ధి చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే గతంలో ఈ వివాదంలో హైకోర్టు ఇచ్చిన ఇతర ఆదేశాలు వర్తిస్తాయని ధర్మాసనం తెలిపింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ తరఫున్యాయవాది జర్నలిస్టులు సొసైటీ ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకొనేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపింది.