జాతీయ వార్తలు

అనంత్‌నాగ్ ఉప ఎన్నిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్‌సభ ఉప ఎన్నిక వాయిదా పడింది. ఈ నెల 25న ఎన్నిక జరగాల్సి ఉండగా శాంతిభద్రతలు క్షీణించడం, సాయుధ బలగాలు అందుబాటులో లేనందున ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వాస్తవానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దాన్ని ఈ నెల 25కు వాయిదా వేశారు. అయితే కాశ్మీర్‌లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ వాయిదా వేయకతప్పలేదు. దీనికి సంబంధించి పది పేజీల నోట్‌ను సోమవారం అర్ధరాత్రి ఇసి విడుదల చేసింది. ఇక్కడనుంచి గెలిచిన మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో అనంత్‌నాగ్ ఎంపీ సీటుకు ఖాళీ ఏర్పడింది. రాష్ట్రంలో నిత్యం ఏదో ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొనడం, స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేయకతప్పలేదు.