జాతీయ వార్తలు

అరాచకత్వం ఎప్పటికీ సాగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీల్లోనూ ఘనంగా బిజెపి విజయం సాధించటం అరాచకత్వం అంతానికి సంకేతమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఫలితాలు పునాది వంటివని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో పోలింగ్‌బూత్ స్థాయి కార్యకర్తలదే ఢిల్లీ విజయమని ఆయన అన్నారు. తమ విజయానికి కారణాలు తెలుసుకోవాలంటే బూత్‌స్థాయిలో బిజెపి కార్యకర్తలను కలుసుకోవాలని ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అమిత్ షా హితవు చెప్పారు. ‘దేశ రాజధానిలో తీర్పు, దేశమంతటా ఇచ్చిన తీర్పు లాంటిదే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల ప్రజలు మరోసారి విశ్వాసం చూపించారు. మోదీ ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోదం లభించింది’ అని షా అన్నారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆప్, కాంగ్రెస్‌లను స్థానిక ఎన్నికల్లో ఓడించటం కార్యకర్తల కృషివల్లే జరిగిందని ఆయన అభినందించారు. ‘విజయం అనేది ఈవిఎంలవల్ల సాధ్యపడదు. బూత్‌స్థాయి కార్యకర్తల వల్ల జరిగింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. అరాచకంగా పరిపాలించటం ఎంతోకాలం సాగదన్నారు. ఈవిఎంల టాంపరింగ్ అంటూ ఎన్నికల సంఘానికి వివిధ పార్టీలు ఫిర్యాదు చేయటం విడ్డూరమని ఆయన కొట్టి పారేశారు.