జాతీయ వార్తలు

ట్యాంపరింగ్ చేయొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం భారతీయ జనతా పార్టీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేసిందని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇవిఎంను రిగ్ చేయడం ఎంత సులభమో మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రదర్శించి చూపించింది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం డూప్లికేట్ ఇవిఎంను హ్యాక్ చేశారని పేర్కొంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ సీక్రెట్ కోడ్‌ను ఫీడ్ చేయడం ద్వారా ఇవిఎంను సులభంగా తారుమారు చేయవచ్చని అన్నారు. అంతేకాదు స్వయంగా ఐటి నిపుణుడైన ఆయన తాను తీసుకు వచ్చిన ఒక ఇవిఎంను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో సభ్యులకు చూపించారు. ఇవిఎంకు ఒక సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేసిన తర్వాత భరద్వాజ్ ఆమ్ ఆద్మీ పార్టీకి పది ఓట్లు వేశారు. అయితే నాటకీయంగా ఆయన వేసిన ఓట్లన్నీ బిజెపికి పడ్డాయి. తాము ఇవిఎంలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదని ఈ ప్రదర్శనతో తేలిపోయిందన్నారు. ఇవిఎంను రిగ్ చేయడానికి మదర్‌బోర్డును మారిస్తే చాలని, దానికి కేవలం 90 సెకన్లు చాలని కూడా భరద్వాజ్ చెప్పారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఇవిఎంలను ట్యాంపర్ చేయవచ్చన్న ఆమ్ ఆద్మీ పార్టీ వాదనను తోసిపుచ్చింది. అంతేకాదు ఢిల్లీ అసెంబ్లీలో ప్రదర్శించినది అసలైన ఇవిఎం కాదని, దాని మాదిరిగా ఉండే డూప్లికేట్ అని ఇసి స్పష్టం చేసింది. ఇసిఐలో కాకుండా వేరే చోట తయారైన ఇవిఎంలను తమకు ఇష్టమొచ్చిన రీతిలో ప్రోగ్రామింగ్ చేయవచ్చనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే అంతమాత్రాన ఇసిఐ-ఇవిఎంలు కూడా అలాగే పని చేస్తాయని అర్థం కాదని, అవి సాంకేతికంగా ఎంతో సుభద్రమైనవని కూడా ఇసి స్పష్టం చేసింది. మరోవైపు బిజెపి దీన్నంతా ఓ డ్రామాగా అభివర్ణించింది. కాగా, భరద్వాజ్ ఉపయోగించిన ఇవిఎం ఎక్కడినుంచి సంపాదించారో చెప్పాలని మాజీ ఎన్నికల ప్రధానాధికారి నవీన్ చావ్లాకూడా అన్నారు. ఇదిలా ఉండగా, ఈ రోజు ఏర్పాటు చేసిన ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, జెడి (యు)లాంటి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించింది. అసెంబ్లీకి వచ్చిన ఆ పార్టీల ప్రతినిధులు విజిటర్స్ గ్యాలరీనుంచి భరద్వాజ్ చేసిన ప్రదర్శనను తిలకించారు.
బిజెపి సభ్యుడి గెంటివేత
కాగా, మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే బిజెపి సభ్యుడు విజేంద్ర గుప్తాను బలవంతంగా అసెంబ్లీనుంచి బైటికి పంపించి వేశారు. గొడవ చేస్తున్నందుకు గాను గుప్తాను బైటికి తీసుకెళ్లాల్సిందిగా స్పీకర్ మార్షల్స్‌ను ఆదేశించారు. అయితే తనను బలవంతంగా అసెంబ్లీనుంచి బైటికి పంపించివేయడంపై నిరసన తెలిపిన గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీలో ఇటీవల తలెత్తిన సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జరిపిన ప్రయత్నమే ఇవిఎంల ట్యాంపరింగ్ ప్రదర్శన అని అన్నారు. ‘వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం గురించి ముఖ్యమంత్రికి తెలుసు. అరవింద్ కేజ్రివాల్, మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఈ కుంభకోణంతో సంబంధం ఉంది. జైన్‌ను అరెస్టు చేయాలి. సభలో నన్ను మాట్లాడనివ్వనప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందో అర్థం కావడం లేదు’ అని ఆయన అన్నారు. కాగా, ఇటీవల కేజ్రివాల్ కేబినెట్‌నుంచి తొలగించిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఇటీవల తలెత్తిన సంక్షోభంనుంచి జనం దృష్టిని మళ్లించడం కోసమే ఇవిఎంల ట్యాంపరింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఆయన ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అన్నారు.

చిత్రం..ఇవిఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో వివరిస్తున్న ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్