జాతీయ వార్తలు

ముగ్గురు రేపిస్టులకు మరణ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, మే 9: ఎనిమిదేళ్ల క్రితం జరిగిన నయన పూజారి అనే 28ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్, గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితులైన ముగ్గురికి ఇక్కడి ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది.అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ హత్య, మానభంగం కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదం అనే ముగ్గుర్ని సోమవారం నేరస్తులుగా నిర్థారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎల్‌ఎల్ యెంకర్ వారికి మంగళవారం శిక్షలు ఖరారు చేశారు. ఈ కేసులో నాలుగో నిందితుడు అప్రూవర్‌గా మారడంతో కోర్టు అతడ్ని వదిలేసింది. 2009 అక్టోబర్ 7న ఈ అత్యాచారం, హత్య సంఘటన జరిగింది. ఇక్కడికి సమీపంలోని ఖరాడిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న నయన పూజారీ ఇంటికెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో మొత్తం నలుగురు ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి, అనంతరం దారుణ హత్యకు పాల్పడ్డారు. సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అమె మృత దేహం జరేవాడి అటవీ ప్రాంతంలో లభించింది.