జాతీయ వార్తలు

బిజెపికే మా మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: రాష్టప్రతి పదవికి బిజెపి ప్రతిపాదించే అభ్యర్థికే తమ పూర్తి మద్దతు ఉంటుందని వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్షం నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. జగన్‌మోహన్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈవిషయాన్ని ప్రకటించారు. బిజెపికి పూర్తి బలం ఉన్నందున ప్రతిపక్షం రాష్టప్రతి పదవికి పోటీ చేయటం అనవసరమని అభిప్రాయపడ్డారు. బిజెపి ప్రతిపాదించే అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిపక్షం తమ అభ్యర్థిని రంగంలోకి దించటంలో అర్థం లేదన్నారు. రాష్టప్రతిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే మంచిదని జగన్ అభిప్రాయపడ్డారు. ‘బిజెపితో మాకు ఎలాంటి విభేదాలు లేవు. బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న అన్ని చర్యలనూ సమర్థించాం. ఇకమీదట కూడా సమర్థిస్తాం’ అని జగన్ ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం వినా మరే ఇతర అంశంలో తమకు బిజెపితో విభేదాలు లేవని జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు.
ప్రజలకు నష్టం కలుగుతుందని, కలిగిస్తుందని భావించినందుకే భూసేకరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకించిందన్నారు. రాష్టప్రతి ఎన్నికలో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసేందుకే నరేంద్ర మోదీ మీకు అప్పాయింట్‌మెంట్ ఇచ్చారా? అని ఒక విలేఖరి ప్రశ్నించగా, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరిస్తారని మీరెందుకు అనుకుంటున్నారని జగన్‌మోహన్ రెడ్డి ఎదురు ప్రశ్న వేశారు. రాష్డ్రపతి పదవికి ప్రతిపక్షం అభ్యర్థిని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పలువురితో చర్చలు జరపటం గురించి తనకు తెలియదన్నారు. రాష్టప్రతి పదవికి పోటీ పెట్టటమే తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్టప్రతి పదవికి జరిగే ఎన్నికలో బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చర్చల సందర్భంగా మోదీ కోరినట్టు జగన్‌మోహన్ రెడ్డి వెల్లడించారు.

చిత్రం.. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి