జాతీయ వార్తలు

కర్ణన్ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 10: కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సుఅపీంకోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించిన కలకత్తా హైకోర్టు జడ్జి సిఎస్ కర్ణన్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు బుధవారం తమిళనాడులోని వివిధ నగరాలను జల్లెడ బట్టారు కానీ ఆయన మాత్రం వారికి చిక్కలేదు. సోమవారం రాత్రి కోల్‌కతానుంచి చెన్నైకి బయలుదేరిన 61 ఏళ్ల కర్ణన్‌ను అరెస్టు చేయడానికి కోల్‌కతా పోలీసుకు చెందిన అయిదుగురు సభ్యుల బృందం ఒకటి బుధవారం ఉదయం చెన్నై చేరుకుంది. అయితే కర్ణన్ బుధవారం ఉదయమే ఇక్కడికి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన సాయంత్రం 4 గంటలకు ఆలయంలో ఉండవచ్చని కూడా ఆ వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి కర్ణన్ సెంట్రల్ చెన్నైలోని చేపాక్ ప్రాంతంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బస చేసినట్లు చెప్పిన ఆ వర్గాలు ఆయన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయలేదని కూడా తెలిపాయి. దీంతో కోల్‌కతానుంచి వచ్చిన పోలీసు బృందం కర్ణన్‌ను అరెస్టు చేసేందుకు చెన్నై పోలీసుల సాయం కోరినట్లు తెలుస్తోంది. కాగా, సర్వీసులో ఉన్న ఓ హైకోర్టు న్యాయమూర్తిని అరెస్టు చేయబోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కర్ణన్ వచ్చే నెల రిటైర్ కావలసి ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా దేశవ్యాప్తంగా పలువురు న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లోకెక్కిన కర్ణన్‌పై ఆగ్రహించిన సుప్రీంకోర్టు ఆయనపై చర్యలకు దిగడం, దీనికి ప్రతిగా కర్ణన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు జడ్జీలకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద శిక్షలు విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం కర్ణన్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా నిర్ధారిస్తూ ఆయనకు ఆరునెలలు జైలుశిక్ష విధించడమే కాకుండా ఆయనను తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించడం తెలిసిందే.