జాతీయ వార్తలు

మొఘల్ పాలకులంతా దురాక్రమణదారులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 10: భారత్‌ను పాలించిన మొఘల్ పాలకులను ఈ దేశంపైకి ‘దండెత్తివచ్చిన వారు’గా ప్రజలు అంగీకరిస్తే దేశంలో ఉన్న సమస్యలన్నీ సమసిపోతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విశ్వసిస్తున్నారు. ఆదిత్యనాథ్ మంగళవారం ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల దినపత్రిక బుధవారం సంచికలో ఈ విషయం వెల్లడించింది. తన చరిత్రను పరిరక్షించుకోలేని రాజ్యం, సమాజం తన భౌగోళిక ప్రాంతాన్ని ఎప్పటికీ పరిరక్షించుకోజాలదని ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో మంగళవారం నిర్వహించిన మహారాణా ప్రతాప్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజి, గురుగోవింద్ సింగ్ వంటి నిజమైన హీరోలను స్మరించుకుంటూ ఉత్సవాలు జరుపుకోవాలని ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. ప్రజలు తమ నిజమైన హీరోల గురించిన నిజమైన చరిత్ర నుంచి స్ఫూర్తి పొందటం ప్రారంభిస్తే ఉగ్రవాదుల భయమే ఉండదని ఆయన అన్నారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ), ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థల గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘మహారాణా ప్రతాప్, గురుగోవింద్ సింగ్, ఛత్రపతి శివాజి ఆదర్శనీయులు. వారు చూపిన మార్గాన్ని మనం అనుసరించి తీరాలి’ అని ఆదిత్యనాథ్ అన్నారు. ‘యువత మహారాణా ప్రతాప్ ఆత్మగౌరవం, సత్ప్రవర్తన బలం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అక్బర్, ఔరంగజేబు, బాబర్‌లు దండెత్తివచ్చిన వారు. త్వరలోనే ఈ నిజాన్ని మనం అంగీకరిస్తాం. మన దేశ సమస్యలన్నీ సమసిపోతాయి’ అని ఆదిత్యనాథ్ అన్నారు.