జాతీయ వార్తలు

నసీరుద్దీన్‌పై బిఎస్పీ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 10: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ముస్లిం నేత నసీరుద్దీన్ సిద్దిఖీ, ఆయన కుమారుడిపై బిఎస్పీ అధినేత్రి మాయావతి వేటు వేశారు. ఇద్దర్నీ పార్టీనుంచి బహిష్కరించారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేరు చెప్పి నిధులు దండుకున్నారని, అలాగే బినామీ పేర్లతో కబేళాలు నిర్వహిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నందునే బహిష్కరించినట్టు బిఎస్పీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ఎస్‌సి మిశ్రా వెల్లడించారు. పనులు చేసిపెడతామని నసీరుద్దీన్, ఆయన కుమారుడు అఫ్జల్ డబ్బులు వసూలు చేసినట్టు బుధవారం ఆయన తెలిపారు. ఇలా ఉండగా పార్టీ నుంచి బహిష్కరించిన వెంటనే నజీరుద్దీన్ సిద్ధిఖీ మీడియాతో మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలన్నీ మాయవతికీ వర్తిస్తాయని ఎదురుదాడి చేశారు. మాయావతిలో బంధుప్రీతి, ఆశ్రీత పక్షపాతం ఎక్కువైపోయిందని, అవినీతి గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదని సిద్దిఖీ అన్నారు. మాయావతి తప్పుడు విధానాలవల్లే ఎన్నికల్లో బిఎస్పీ పరాజయాలపాలవుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశారని, సోదరుడు ఆనంద్ కుమార్‌ను తీసుకొచ్చి పార్టీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారని నసీరుద్దీన్ విమర్శించారు.