జాతీయ వార్తలు

‘ఏకీకృత సర్వీసులకు న్యాయశాఖ ఆమోదం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నియమ, నిబంధనలు తయారు చేసేందుకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపిందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలచారి, టిఆర్‌ఎస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు, విధాన మండలి సభ్యులు కె.జనార్దన్ రెడ్డి, పి.రవీందర్, సరోత్తం రెడ్డి, మోహన్ రెడ్డి తెలిపారు. వేణుగోపాలచారి తదితరులు గురువారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ తామీ రోజు న్యాయ శాఖలో లెజిస్లేటివ్ వ్యవహారాల కార్యదర్శిని కలిసి ఏకీకృత సర్వీసులను వెంటనే ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి వివరించామని, ఆయన వెంటనే ఈ ఫైలును తెప్పించుకుని తమ ఆమోదం తెలిపి కేంద్ర హోం శాఖ అనుమతికి పంపించినట్లు వివరించారు. ఈ సమస్య గత పదహారు సంవత్సరాలనుండి పెండింగ్‌లో ఉన్నదంటూ ఇప్పుడీ సమస్యను పరిష్కరించటం వలన రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలు పెరుగుతాయని, పర్యవేక్షణాధికారుల నియామకానికి మార్గం సుగమం అవుతుందని, విద్యా రంగం అభివృద్ధి చెందటంతో పాటు ఉపాధ్యాయులకు ఎంతో మేలు జరుగుతుందని వేణుగోపాలచారి, మోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పట్టుదల మూలంగానే ఏకీకృత సర్వీసులకు కేంద్రం ఆమోదం తెలుపుతోందని వారన్నారు. కేంద్ర హోం శాఖ ఏకీకృత సర్వీసుల ఫైలును పరిశీలించిన వెంటనే రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం కోసం పంపిస్తుందంటూ, రాష్టప్రతి ముద్ర పడటమే ఇక ఆలస్యమని వారు అన్నారు.