జాతీయ వార్తలు

అటల్‌జీ సాహసం ప్రశంసనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: పోఖ్రాన్ అణుపరీక్ష సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రశంసనీయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1998 మే 11న నిర్వహించిన పోఖ్రాన్ అణుపరీక్షను పురస్కరించుకొని ఏటా మే 11న జరుపుకుంటున్న ‘నేషనల్ టెక్నాలజి డే’ సందర్భంగా గురువారం మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ శాస్ర్తియ, వైజ్ఞానిక పటిమను, సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతిని ప్రపంచానికి చాటి చెప్పిన మే 11ను 1999 నుంచి ఏటా జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవంగా పాటిస్తున్నాం.
జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా శ్రమశీలురయిన శాస్తవ్రేత్తలకు, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఉత్సుకత గల వారికి శుభాకాంక్షలు అని ప్రధాని మోదీ గురువారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. ‘1998లో పోఖ్రాన్‌లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన శాస్తజ్ఞ్రులకు, అప్పటి రాజకీయ నాయకత్వానికి మనం కృతజ్ఞులం’ అని మోదీ పేర్కొన్నారు.
భారత్ తన అయిదు అణు పరీక్షలలో మొదటి పరీక్షను 1998 మే 11న పోఖ్రాన్‌లో విజయవంతంగా నిర్వహించింది. ఈ అణు పరీక్ష భారత్ శక్తిసామర్థ్యాలను మొత్తం ప్రపంచానికి చాటి చెప్పింది. దీనిని దృష్టిలో పెట్టుకొని నరేంద్రమోదీ.ఇన్ వెబ్‌సైట్‌లో ప్రధాని గతంలో ఇచ్చిన ఉపన్యాసాన్ని ఉటంకించారు. ‘పోఖ్రాన్ పరీక్షల గురించి ప్రపంచానికి బాగా తెలుసు. అటల్‌జీ నాయకత్వంలో ఈ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. భారత్ శక్తిసామర్థ్యాలకు మొత్తం ప్రపంచమే సాక్షిగా ఉంది. శాస్తజ్ఞ్రులు దేశం గర్వించే పనిచేశారు’ అని మోదీ గతంలో ఇచ్చిన ఉపన్యాసం పేర్కొంది. సుమారు రెండు దశాబ్దాల నాటి పరిణామాలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘మొదటి పరీక్షల అనంతరం ప్రపంచ సమాజం భారత్‌పై ఆంక్షలు విధించింది. 1998 మే 13న అటల్‌జీ మళ్లీ అణు పరీక్షలకు పిలుపునిచ్చారు. అటల్‌జీ భిన్నమైన స్వభావాన్ని, పౌరుషాన్ని అది తెలియజేసింది. మనం అప్పుడు బలహీనమైన ప్రధానిని కలిగి ఉంటే, అతను లేదా ఆమె ఆ రోజున భయపడి ఉండేవారు. కాని, అటల్‌జీ భిన్నమైన నేత. ఆయన భయపడలేదు’ అని మోదీ అన్నారు. అణు పరీక్షలకు ప్రణాళిక రూపొందించి, అమలు చేసిన కాలమంతా వౌనంగా ఉన్న పోఖ్రాన్ ప్రజలను అభినందించి తీరాలని మోదీ అన్నారు. పోఖ్రాన్ ప్రజలు మిగతా వాటన్నింటి కన్నా జాతీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..గురువారం కొలంబో చేరుకున్న అనంతరం సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో శ్రీలంక మాజీ ప్రధాని రనిల్ విక్రమ సంఘే తదితరులు