జాతీయ వార్తలు

‘హిజ్బుల్’ దుశ్చర్యే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 11: జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ యువ లెఫ్టినెంట్ అధికారి ఉమర్ ఫయాజ్ హత్య హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ సీనియర్ పోలీసు అధికారి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫయాజ్ హత్యకు ముందు అతడిని చిత్రహింసలకు గురిచేశారా లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందని, నివేదికకోసం వేచిఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ‘మిలిటెంట్ల దుశ్చర్యపై ప్రాథమిక విచారణ జరిపాం. షోపియాన్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు ఎక్కువ. ఆ కోణంలోనూ దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి’ అని జమ్మూకాశ్మీర్ ఐజి ఎస్‌జెఎం గిలానీ అన్నారు. సంఘటనాస్థంలో ఐఎన్‌ఎస్‌ఏఎస్ తుపాకీ, రెండు ఖాళీ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ‘దక్షిణ కాశ్మీర్‌లో ఇలాంటి సంఘటనలు ఇటీవల రెండు వెలుగుచూశాయి. కుల్‌గావ్‌లో జరిగిన సంఘటనలో లష్కరె తొయిబా మిలిటెంట్లు ఉన్నట్టు నిర్ధారణ అయింది. షోపియాన్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ హస్తంపై అనుమానాలున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. బటాపురలో కజిన్ వివాహ వేడుకలకు హాజరైన ఫయాజ్‌ను మిలిటెంట్లు కిడ్నాప్ చేసి, హత్య చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మిలిటెంట్ల దుశ్చర్య బుధవారం ఉదయం వెలుగుచూసింది.

చిత్రం..ఉమర్ ఫయాజ్ హత్యకు నిరసనగా గురువారం జమ్మూలో ఆందోళన చేస్తున్న శివసేన కార్యకర్తలు