జాతీయ వార్తలు

రాజీవ్‌గాంధీ ట్రస్ట్‌కు అమేథీ అధికారుల నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేధీ, మే 12: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన నడుస్తున్న రాజీవ్‌గాంధీ చారిటబుల్ ట్రస్‌కు అమేధీ జిల్లా అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారికంగా ఎలాంటి అనుమతులు ప్రభుత్వ స్థలంలో వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారన్నది నోటీసులు సారాంశం.‘సుమారు 10,000 చదరపుఅడుగుల స్థలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పాఠశాలలు, శిక్షణ కేంద్రాలకు కేటాయించారు. అయితే రాజీవ్ గాంధీ ట్రస్ట్ అక్కడ స్థానిక మహిళలకు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతోంది’ అని సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్ అశోక్ శుక్లా తెలిపారు. వాస్తవానికి ఆ స్థలం ప్రభుత్వ అజమాయిషీలోనని అన్నారు. ప్రభుత్వ స్థలా న్ని అనధికారికంగా వాడుకుంటున్న విషయాన్ని ఏప్రిల్ 22న నోటీసు ద్వారా ట్రస్ట్‌కు తెలిపారు. సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఈ చారిటబుల్ ట్రస్ట్‌లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ్యుడిగా ఉన్నారు. రాజీవ్‌గాంధీ మహిళా వికాస్ ప్రయోజన కేంద్రం నిర్వహణకు సంబంధించి పేపర్లు ట్రస్ట్ చూపించలేకపోయిందని శుక్లా స్పష్టం చేశారు. ఇంతకు ముందు కూడా జిల్లా అభివృద్ధి అధికారి, చీఫ్ డెవలప్‌పెంట్ అధికారి వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు. వాటికీ ట్రస్ట్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీనిపై రాజీవ్‌గాంధీ మహిళా వికాస్ ప్రయోజన సీనియర్ అధికారిని సంప్రదించగా ఏప్రిల్ 27నే ట్రస్ట్ నోటీసుకు రిప్లయి ఇచ్చిందని అన్నారు. మంజూ కళ్యాణ్ కేంద్రానికి స్థలం కేటాయింపుజరిగిందని, 13ఏళ్ల నుంచి సంయుక్తంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని వివరణ ఇచ్చారు.