జాతీయ వార్తలు

శల్య పరీక్షకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: ఈవిఎంలను టాంపర్ చేసి చూపించాలని కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సవాల్ విసిరింది. ‘ఈవిఎంలను టాంపర్ చేయటం అసాధ్యం. ఆ విషయాన్ని నిరూపించేందుకు త్వరలోనే ‘హాకథాన్’ నిర్వహిస్తున్నాం. అనుమానాలు ఉన్నవాళ్లు ఎవ్వరైనా ఆరోజన బహిరంగ పరీక్షలో ఈవిఎంను టాంపర్ చేసి చూపించొచ్చు’ అని కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ, ప్రాంతీయ పార్టీలకు సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఏడు జాతీయ పార్టీలు, 35 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఈవిఎంలపై వచ్చిన ఆరోపణలను చర్చించింది. తమ ఈవిఎంలను టాంపర్ చేయటం అసాధ్యమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ స్పష్టం చేశారు. గుర్తింపులేని ఓటింగ్ యంత్రాల్లో మా ప్రోగ్రామ్ పెట్టి టాంపర్ చేయగలుగుతామని ప్రకటించటం హాస్యాస్పదం. కేంద్ర ఎన్నికల సంఘం ఈవిఎంలను టాంపర్ చేసి చూపించొచ్చు అని ఈసి సవాల్ విసిరింది. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఈవిఎంలను టాంపర్ చేయటం ఎవ్వరికీ సాధ్యం కాదని జైదీ స్పష్టం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఇకమీదట పార్లమెంటు, శాసన సభలతోపాటు అన్ని ఎన్నికలను వివిపిఏటిలతో కూడిన ఈవిఎంలతోనే నిర్వహిస్తామని రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చింది. ఈవిఎంలను టాంపర్ చేయటం అసాధ్యమని స్పష్టం చేసిన జైదీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మరింత పటిష్టం చేసేందుకు రాజకీయ పార్టీలు చేసే అన్ని సూచనలు, సలహాలను తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు. ఈవిఎంల పటిష్టంతోపాటు పలు ఎన్నికల సంస్కరణలను ప్రతిపాదించినట్టు రాజకీయ పార్టీలకు జైదీ వివరించారు. ఎన్నికల్లో అంగబలం, అర్థబలాన్ని నియంత్రించేందుకు కేంద్రానికి పలు సిఫార్సులు చేశామన్నారు.
ఏ పార్టీకీ అనుకూలం కాము
కేంద్ర ఎన్నికల సంఘం తటస్థంగా ఉండి పని చేస్తుంది. ఏ ఒక్క రాజకీయ పార్టీకీ తాము సన్నిహితం కామని జైదీ ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకూ సమదూరంలో ఉంటుందన్నారు. ఈవిఎంలను టాంపర్ చేయవచ్చంటూ కొంతకాలంగా వస్తోన్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఈవిఎంలు, వివిపిఏటిలను పటిష్టం చేసేందుకు తాము తీసుకున్న పలు చర్యలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. రాజకీయ పార్టీల ఎన్నికల నిధుల విషయంలో పారదర్శకత తెచ్చేందుకు ఆదాయం పన్ను చట్టాన్ని సవరించే ప్రతిపాదన కూడా చేశామన్నారు. ఇదిలావుంటే కేంద్ర ఎన్నికల సంఘం డైరక్టర్ జనరల్ సుదీప్ ఈవిఎంల పటిష్టతపై రాజకీయ పార్టీలకు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఈవిఎంల విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న అన్ని జాగ్రత్తలనూ వివరించారు.

చిత్రం.. ఈవిఎంలపై రాజకీయ పక్షాలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ఈసి బృందం