జాతీయ వార్తలు

‘బ్యాలెట్’కు టిడిపి జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 12: ఎలక్ట్రానిక్ ఓడింగ్ యాంత్రాల(ఈవీఎం) విశ్వసనీయతపై కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా జాతీయ,్ర పాంతీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలనుంచి టీడీపీ,టీఆర్‌ఎస్,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఈ సమావేశానికి హాజరైయ్యాయి.టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి,టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపీ వినోద్‌కుమార్,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మండలి ప్రతిపక్ష నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు హాజరైయ్యారు.
ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లు విధానం ఉపయోగించాలని ఈసీ సమావేశంలో కోరినట్టు టీడీపీ శ్రీరాం మాల్యాద్రి తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు నివృత్తి చేయ్యకూండా ఈవీఎంల ద్యారా నిర్వహించడం సరికాదన్నారు.అప్పటి వరకు బ్యాలెట్ పేపర్లు కోనసాగిచాలని కోరారు.
బ్యాలెట్ విధానం సరికాదు: వైకాపా
ఈవీఎంల ట్యాంపరింగ్‌కు గురువుతున్నయని,మళ్లీ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయ్యాలన్నా వాదనలు సరికాదని వైఎస్సార్ పార్టీ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.ముఖ్యాంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్జానాన్ని వినియోగించి ఈవీఎం సరిదిద్దుకోవడమే సరైనదని ఉమారెడ్డి వెల్లడించారు.ట్యాపరింగ్‌క అవకాశం లేని విధంగా ఈవీఎంలను తీసుకోచ్చి ప్రజలలో విశ్వాసం కల్గించాలని పేర్కొన్నారు.
ఈవీఎంలకు టీఆర్‌ఎస్ అనుకులం
అభివృద్ది,సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించుకుని మరింత సామర్ధ్యమున్న ఈవీఎంలపై ప్రజలకు విశ్వసం కల్గించాలని ఎంపీ వినోద్ అన్నారు.ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా విమర్శలు చేయడం సరికాదని,ఈవీఎంల ద్యారా ఎన్నికలు నిర్వహిచడాన్ని టీఆర్‌ఎస్ పార్టీ స్వాగతిస్తుందని,సమర్థిస్తుందని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ తన విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తొందని,ఎన్నికల సంఘం నిర్వహించాని సమావేశంలో కొన్ని పార్టీల మినహా అన్ని పార్టీలు ఈవీఎంలను సమర్ధించాయని తెలిపారు.