జాతీయ వార్తలు

హిజ్బుల్ ముజాహిదీన్‌లో చీలిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 13: కాశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పాక్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌లో విభేదాలు తలెత్తిన సంకేతాలు కనిపిస్తున్నాయి. వేర్పాటువాద హురియత్ నేతల తలలు నరికి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద వేలాడదీస్తానంటూ బెదిరించిన స్థానిక కమాండర్ ముసా ప్రకటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఆ సంస్థ నాయకత్వం ప్రకటించడమే దీనికి నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. ఇస్లాంకోసం తాము జరుపుతున్న పోరాటంలో జోక్యం చేసుకున్నందుకు హురియత్ నేతల తలలు నరికి లాల్ చౌక్ వద్ద వేళ్లాడదీస్తానని ముసా హెచ్చరించాడు. అయితే ముసా ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని హిజ్బుల్ ప్రతినిధి సలీమ్ హాష్మి ఆ ప్రకటనలో అన్నాడు. అంతేకాదు గందరగోళం సృష్టించే ఏ ప్రకటన లేదా చర్య అయినా తమ పోరాటానికి విఘాతమవుతుందని కూడా ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా, హురియత్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా ముసా పేర్కొనే మరో ఆడియో శనివారం హిజ్బుల్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే ప్రత్యక్షం కావడం కొసమెరుపు.