జాతీయ వార్తలు

వివేక్ బబెరాయ్ ఔదార్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: అంతర్గత శక్తుల నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రాణ త్యాగం చేసిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోడానికి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముందుకు వచ్చారు. జవాన్ల కుటుంబాలకు 25 ఫ్లాట్స్ ఒబెరాయ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఇవ్వనుంది. మహారాష్టల్రోని థానేలో వివేక్‌కు నిర్మాణ సంస్థ ఉంది. సుక్మాలో నక్సల్స్ కాల్పుల్లో చనిపోయిన నలుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఇప్పటికే ఫ్లాట్లు అందజేసినట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ముంబయిని ఆనుకునే థానే జిల్లాలో కర్రమ్ రెసిడెన్సీ, కర్రమ్ పంచతత్వ పేరుతో రెండు వెంచర్లు వేసి భవనాలు నిర్మించారు. అక్కడే అమర జవాన్లకు ఫ్లాట్లు ఇవ్వనున్నారు. కాగా మరో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మందుపాతరకు బలైన సిఆర్‌పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి తొమ్మిదేసి లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. సైనా నెహ్వాల్ 12 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల సహాయం ప్రకటించారు.