జాతీయ వార్తలు

మళ్లీ నిర్భయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనిపట్ (హర్యానా), మే 13: హర్యానాలో 16/12 పునరావృతమైంది. 23 ఏళ్ల యువతి నిర్భయగా మారింది. కిరాతకుల చేతిలో అత్యంత దారుణంగా సాముహిక అత్యాచారానికి గురైంది. కామాంధులు ఆమెను అంతటితో వదలకుండా పైశాచికంగా హత్య చేశారు. ఇటుకరాయితో ఆమె ముఖాన్ని గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఛిద్రం చేశారు. శరీరాన్ని ముక్కలు చేసి పడేశారు. ఆ తరువాత ఆ అభాగ్యురాలి మృతదేహంలోని భాగాల్ని కుక్కలు పీక్కుతిన్నాయి. అత్యంత దయనీయంగా ఓ అమ్మాయి జీవితం బలైపోయింది. దేశ రాజధాని ఢిల్లీకి కేవలం 70కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలోని సోనిపట్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం 23 ఏళ్ల యువతిని సోనిపట్‌లోని ఆమె ఇంటి నుంచి మే 9వ తేదీన దుండగులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. ఆ తరువాత ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారం చేసారు. ఏడుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కిరాతకులు అంతటితో ఆగకుండా ఆమెను హత్య చేసి తలను ఇటుకరాయితో పదే పదే మోది గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఛిద్రం చేశారు. ఆమె శరీరం రోహతక్ పట్టణ ప్రాంతంలో లభించిందని పోలీసులు తెలిపారు. అటు వైపు నుంచి వీధిలో వెళ్తున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని చూసి తమకు సమాచారం అందించారన్నారు. వీధి కుక్కలు ఆమె ముఖాన్ని, శరీరంలో కింది భాగాలకు కొరికేశాయని సబ్ ఎన్‌స్పెక్టర్ అజయ్ మాలిక్ వివరించారు. మే ఈ ఘటనకు సంబంధించి వికాస్, సుమిత్ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సుమిత్ బాధితురాలికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి అని మాలిక్ తెలిపారు.
నేరస్థులను ఉరితీయాలి
తమ కూతుర్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన వారిని ఉరితీయాలని అభాగ్యురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు కానీ, అధికారులు కానీ ఎవరూ తమ దగ్గరకు రాలేదని వారు ఆరోపించారు. తమ కూతురు అదృశ్యమైందని సోనిపట్ పోలీస్ స్టేషన్‌లో అంతకు ముందు ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు. ఆ తరువాత ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
సోనియా దిగ్భ్రాంతి
హర్యాణా సోనిపట్‌లో యువతిపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘ ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన నేనే కాదు, యావత్ దేశాన్ని కలచివేస్తోంది. దేశంలో మహిళల రక్షణ, భద్రతల గురించి మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.’’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిందితులపై హర్యానా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.