జాతీయ వార్తలు

ఇందిర నిర్ణయాత్మక శక్తి అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: ఇందిరాగాంధీ ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా అందరికంటే ఎక్కువ ఆమోదయోగ్యురాలైన ప్రధాన మంత్రి అని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. పార్టీలో సంస్థాగతంగా కానీ, ప్రధానిగా పరిపాలనలో కానీ అత్యంత వేగంగా తీసుకునే ఆమె నిర్ణయాత్మక శక్తి అమోఘమైనదని ఆయన ప్రశంసించారు. ‘‘ఇండియాస్ ఇందిర, ఏ సెంటెన్నియల్ ట్రిబ్యూట్’’ అన్న గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వానికి గట్టి సందేశానే్న ఇచ్చారు. నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం చేయటం వల్ల పార్టీ ఏ విధంగా నష్టపోతుందో పరోక్షంగా హెచ్చరించారు. 1978లో కాంగ్రెస్ రెండోసారి చీలిపోయిన తరువాత ఇందిర ఎంత వేగంగా పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠపరచి తిరిగి అధికారంలోకి వచ్చిందో వివరించారు. 20వ శతాబ్దాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఇందిర అగ్రశ్రేణి నేత అని ఆయన కొనియాడారు. ‘‘జనవరి 2, 1978లో ఇందిర పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు. జనవరి 20నాటికి అంటే కేవలం 18రోజుల్లో ఆమె వర్కింగ్ కమిటీ, పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేశారు. పిసిసిలు, ఏఐసిసి నిర్మాణాన్నీ పూర్తి చేశారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేశారు. ఏపి, కర్ణాటకలో రెండింట మూడు వంతుల మెజార్టీతో ఘనవిజయాన్ని సాధించారు. మహారాష్టల్రో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది’’ అని ప్రణబ్ వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేతలు ఆనంద్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్టప్రతి ప్రణబ్. చిత్రంలో ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ తదితరులు