జాతీయ వార్తలు

‘శిఖరం’ ఎక్కిన తెలుగు తేజాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 13: అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం ద్వారా రాష్ట్ర సాంఘిక సంక్షేమ - గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ కీర్తిని ప్రపంచానికి చాటారు. శనివారం ఉదయం ఎవరెస్టు శిఖరాగ్రం చేరుకున్న ముగ్గురు విద్యార్థులు జాతీయ పతాకాన్ని, అంబేద్కర్ చిత్రపటం ముద్రించిన రాష్ట్ర-పాఠశాల పతాకాలను ఎగురవేశారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న సీనియర్ ఇంటర్ విద్యార్థి కృష్ణారావు, కర్నూలు జిల్లా బెలగల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న సీనియర్ ఇంటర్ విద్యార్థి సురేష్‌బాబు, తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న సీనియర్ ఇంటర్ విద్యార్థి దుర్గారావు ఈ జైత్రయాత్రను దిగ్విజయంగా పూర్తిచేశారు. అనంతరం అడ్వాన్స్‌డ్ బేస్ క్యాంప్‌కు తిరుగు పయనమయ్యారు. ఇద్దరు అమ్మాయిలతోసహా మొత్తం 11 మంది విద్యార్థులతో కూడిన మొదటి బృందం, ఇద్దరు విద్యార్థులతో కూడిన రెండో బృందం ఎవరెస్టు అధిరోహణకు గత నెల 8న విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లింది. ఎవరెస్టుపై వాతావరణం, ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ బేస్ క్యాంప్‌లో ఉన్న బృందంలోని మిగిలిన సభ్యులు శిఖరాగ్రాన్ని చేరుకుంటారు. కనీసం 12 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైనా ఎవరెస్టు పర్వతారోహణ చేసేలా చూడాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.4 కోట్లతో ఈ మహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శారీరక సామర్థ్యాన్ని బట్టి రాష్ట్రంలోని వివిధ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి ఎంపిక చేసి విజయవాడ దగ్గర కేతనకొండలోని సిబిఆర్ అకాడమీలో ప్రాథమికంగా శిక్షణ ఇచ్చారు. పర్వతారోహణ ప్రముఖ కోచ్ బి శేఖర్‌బాబు పర్యవేక్షణలో విద్యార్థుల్ని సుశిక్షితుల్ని చేశారు. వీరిలో 34 మందిని రెండో దశ శిక్షణ కోసం డార్జిలింగ్‌లోని హిమాలయన్ పర్వతారోహణ సంస్థకు ప్రభుత్వం పంపించింది. వీరిలో 14 మంది విద్యార్థులను చివరిగా ఎంపిక చేసి లడఖ్‌లో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో రెండు వారాలపాటు రాటుదేలేలా శిక్షణ అందించగా ఒకరు మాత్రమే విఫలమయ్యారు. చివరిగా 13 మంది రెండు బృందాలుగా పర్వతారోహణకు వెళ్లారు. ఈ విద్యార్థులు ఓవైపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతూ, పర్వతారోహణకు శిక్షణ పొందుతూ అహర్నిశలు శ్రమించారు. పర్వతారోహణకు వెళ్లిన రెండు బృందాల్లోని 13 మంది విద్యార్థులు మళ్లీ జూన్ మొదటి వారానికి విజయవాడకు చేరుకుంటారు. ఎవరెస్టును అధిరోహించిన విద్యార్థులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. ప్రపంచానికి తెలిసేలా రాష్ట్ర కీర్తి పతాకను హిమ శిఖరంపై ఎగురవేశారంటూ కితాబిచ్చారు. అత్యంత పేథరికం నుంచి వచ్చి అత్యున్నత శిఖరానికి చేరారని ప్రశంసించారు.

చిత్రం..ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే క్రమంలో బేస్‌క్యాంప్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు