జాతీయ వార్తలు

త్వరలో కొత్త మెట్రో రైల్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 14: భవిష్యత్తులో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం ఓ జాతీయ విధానాన్ని రూపొందిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టిఓడి ప్రాతిపదికనే భవిష్యత్ మెట్రోరైల్ విధానాన్ని రూపొందించటం జరుగుతుందని ఆదివారం ఇక్కడ తెలిపారు.
ఇప్పటికే కొత్త మెట్రో రైలు విధానంపై కసరత్తు మొదలైందని, ఇది భూ సేకరణ సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ముందుకు సాగుతుందని వెల్లడించారు. ఇప్పటికే టిఓడి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిందని, దీన్ని దేశంలోని అన్ని మెట్రో ప్రాజెక్టుల విషయంలో కచ్చితంగా అమలు చేయాల్సిందేనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
తిరుమంగళం నుంచి నెహ్రూ పార్కుకు భూగర్భ మెట్రో రైలు సర్వీసును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బోగీల నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఓ ప్రామాణిక విధానాన్ని రూపొందించిందని, అదే విధంగా మెట్రో రైలు కోసం కూడా ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను కూడా రూపొందించిందని తెలిపారు. దేశంలో అన్ని నగరాల్లోనూ పర్యటన పరమైన సౌకర్యాలను మెరుగు పరచేందుకు ‘‘గ్రీన్ అర్బన్ మొబిలిటీ’’ పథకాన్ని రూపొందించే ఆలోచనను కూడా తమ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఈ పథకంలో భాగంగా బైకిల్ షేరింగ్‌తో పాటు రవాణా వాహనాల తో సంబంధం లేని ఇతర మార్గాలను పెంపొందిస్తామన్నారు. ఇప్పటికే చెన్నై మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం రూ.11,301కోట్లను కేటాయించిందన్నారు. మొత్తం రూ.14, 600కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఆమోదించటం జరిగిందన్నారు.

చిత్రం..చెన్నైలోని తిరుమంగళం నుంచి నెహ్రూ పార్కుకు భూగర్భ మెట్రో రైలు సర్వీసును
ఆదివారం ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు