జాతీయ వార్తలు

దావూద్, హఫీజ్‌లను తీసుకురావాలని ఏ దర్యాప్తు సంస్థా కోరలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: ముంబయిలో నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారు హఫీజ్ సరుూద్, అలాగే పాకిస్తాన్‌లో తలదాచుకుని ఉన్నట్లుగా భావిస్తున్న అండర్‌వరల్డ్ డాన్, 1993 ముంబయి వరస బాంబుదాడుల కుట్రదారు దావూద్ ఇబ్రహీంలను భారత్‌కు తీసుకు రావాలని ఇప్పటివరకు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు ఏజన్సీలనుంచి తమకు ఎలాంటి అభ్యర్థన అందలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంనుంచి పారిపోయిన గ్యాంగ్‌లీడర్ దావూద్ ఇబ్రహీం, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సరుూద్‌లను భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియజేయాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దాఖలయిన ఒక ఆర్‌టిఐ పిటిషన్‌కు సమాధానంగా హోం శాఖ ఈ విషయం తెలియజేసింది. ‘హఫీజ్ సరుూద్, దావూద్ ఇబ్రహీంలకు సంబంధించి వారిని దేశానికి తీసుకురావాలని కోరుతూ దేశంలోని దర్యాప్తు ఏజన్సీనుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఎలాంటి అభ్యర్థనా అందలేదు’ అని ఆ సమాధానంలో మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1993లో ముంబయిలో జరిగిన వరస బాంబు దాడుల్లో 260 మందికి పైగా చనిపోగా, మరో 700 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో దావూద్ ఇబ్రహీం ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. దాడులు జరిగిన తర్వాత అతను దేశం వదిలి పెట్టి పారిపోగా, ప్రస్తుతం పాక్‌లో తలదాచుకుని ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 2008 నవంబర్ 26న ముంబయిలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 166 మంది చనిపోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడయిన హఫీజ్ సరుూద్ ఈ దాడులకు కుట్ర పన్నాడనేది ప్రధాన ఆరోపణ.