జాతీయ వార్తలు

మూడేళ్లలో 15 రాష్ట్రాల్లో మలేరియా నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 14: దేశంలో మలేరియా కేసులు, ఈ వ్యాధి కారణంగా సంభవించే మరణాలు బాగా తగ్గాయని ప్రభుత్వం పేర్కొంది. మరో మూడేళ్లలో కనీసం 15 రాష్ట్రాలలో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని తెలిపింది. 2020 నాటికి 15 రాష్ట్రాలలో మలేరియాను నిర్మూలించగలమని కేంద్ర ఆరోగ్య శాఖలోని నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం (ఎన్‌విబిడిసిపి) డైరెక్టర్ ధరీవాల్ తెలిపారు. అంటే ఈ 15 రాష్ట్రాలలో ప్రతి వెయ్యి మంది జనాభాలో ఒక దానికి లోపు యాన్యువల్ పారాసైట్ ఇన్సిడెన్స్ (ఎపిఐ) ఉంటుందని ఆయన వివరించారు. జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు డమన్ అండ్ డియు, లక్షద్వీప్, పుదుచ్చేరి వచ్చే మూడేళ్లలో మలేరియా నుంచి విముక్తి పొందుతాయని ఆయన చెప్పారు. అయితే, ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు మలేరియా సంక్రమణ రిస్క్ గల ప్రాంతాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాలలోని కొన్నింటిలో ప్రతి వెయ్యి జనాభాలో రెండు కన్నా ఎక్కువ ఎపిఐ ఉందని ఆయన వివరించారు. మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందని, వీటిలో ఎపిఐ పదికన్నా ఎక్కువ ఉందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాలను మలేరియా రిస్క్ ఉన్న ప్రాంతాలుగా పరిగణించడం జరుగుతోందని, ఇక్కడ ఎపిఐ వెయ్యి జనాభాకు రెండుగా ఉందని ఆయన చెప్పారు. మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని బంగ్లాదేశ్‌తో సరిహద్దు గల కొన్ని జిల్లాల్లో మలేరియా ఇప్పటికీ ముప్పుగా ఉందని ఆయన తెలిపారు. గత శతాబ్దంతో పోలిస్తే మొత్తం మీద భారత్‌లో మలేరియా విషయంలో పరిస్థితి మెరుగుపడిందని ఆయన వివరించారు.