జాతీయ వార్తలు

దైనందిన జీవితంలో భాగం..యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 14: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 21న లక్నోలో నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమం ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం సమీక్షించారు. లక్నోలోని రమాబాయి అంబేద్కర్ మైదాన్‌లో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులతోపాటుగా దాదాపు 55 వేల మంది పాల్గొననున్నారు. యోగా దినోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను సమీక్షించడానికి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రిని కలిసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. యోగా దినోత్సవ వేడుకలకు ఆయుష్ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సమావేశంలో సమర్పించిన ప్రజంటేషన్‌ను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసిస్తూ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం అవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, సందర్శకులు ఏకకాలంలో ఈ వేడుకల్లో పాల్గొనడానికి వీలుగా నగరంలోని వివిధ పార్కుల్లో ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాక జూన్ 21న జరిగే యోగా ప్రదర్శనలో పాల్గొనేవారికి ముందుగా 28 రోజులపాటు ఒక వర్క్‌షాపును ఏర్పాటు చేయాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ లక్నో నగరాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అలాగే దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక పట్టణంలో ప్రధాన యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అంతేకాక ఈ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన తన వెబ్ పేజిలో ఈ పేజిని సందర్శించిన ప్రతి ఒక్కరూ యోగాను తన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటానంటూ ప్రతిన చేయాలని కూడా కోరుతోంది. ఇప్పటివరకు 30.14 లక్షల మంది ఈ ప్రతిజ్ఞ తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలంటూ ఒక తీర్మానం చేసిన విషయం తెలిసిందే.