జాతీయ వార్తలు

రూ.20వేల కోట్లు ఎక్కడికి పోయాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: ‘్భవన నిర్మాణ కార్మికులకోసం వసూలు చేసిన 20వేల కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి పోయాయి? అధికారులు టీ పార్టీలకోసం లేక విహార యాత్రలకోసం ఖర్చు చేశారా? ఆ సొమ్ము ఏమయిందో చివరికి కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు సైతం తెలియదంటే ఆశ్చర్యం వేస్తోంది...’ ఈ ప్రశ్నలన్నీ వేసింది మరెవరో కాదు. సాక్షాత్తు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయానా కాగ్‌ను ప్రశ్నించింది. ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భవన నిర్మాణ కార్మికులకోసం రియల్ ఎస్టేట్ సంస్థలనుంచి చట్టబద్ధంగా వసూలు చేసిన సెస్ సక్రమంగా సద్వినియోగం కావడం లేదని, ఎందుకంటే లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రయోజనాలను అందించడానికి అవసరమైన వ్యవస్థ లేదని ‘నేషనల్ క్యాంపైన్ కమిటీ ఫర్ సెంట్రల్ లెజిస్లేషన్ ఆన్ కన్‌స్ట్రక్షన్ లేబర్’ అనే ఆ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్‌లో ఆరోపించింది. దీనిపై కాగ్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను, నివేదికను పరిశీలించాక కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సొమ్ము ఎక్కడ ఉందో కాగ్‌కు కూడా తెలియదు. ఇదేమీ చిన్నమొత్తం కాదు, దాదాపు 20వేల కోట్లు అని న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే 1996లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం చేసినప్పటినుంచి ఈ ఏడాది మార్చి 31 దాకా ఎంత మొత్తం వసూలు అయిందో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి తెలుసుకోవాలని బెంచ్ సూచించింది. వసూలు చేసిన మొత్తాన్ని కాగ్ కార్యాలయానికి తెలియజేయాలని బెంచ్ పేర్కొంది. అలాగే ఇనే్నళ్లుగా వసూలు చేసిన మొత్తంలో ఈ ఏడాది మార్చి 31 దాకా ఎంత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు బదిలీ చేశారో కూడా కాగ్‌కు తెలియజేయాలని బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ సెస్ వసూలు చేసినా ఇంకా బోర్డుకు బదిలీ చేయకుండా ఉంటే దాన్నికూడా ఆరువారాల్లోగా బదిలీ చేసి కాగ్‌కు తెలియజేయాలని కూడా బెంచ్ స్పష్టం చేసింది. అనంతరం వివరాలన్నిటినీ తనకు సమర్పించాలని కాగ్‌ను ఆదేశించిన బెంచ్ తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది.