జాతీయ వార్తలు

18 ఏళ్ల తర్వాత మళ్లీ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: భారతీయుడయిన కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షను భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్-ఐసిజె)లో సవాలు చేయడంతో సుమారు 18 ఏళ్ల తరువాత దాయాది దేశాలు మళ్లీ ఐసిజెలో తలపడుతున్నాయి. పాకిస్తాన్ తన నావికాదళ విమానాన్ని భారత్ కూల్చివేయడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ 18 ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన న్యాయ విభాగమైన ఐసిజెను ఆశ్రయించింది. ఇప్పుడు జాదవ్ కేసులో ఐసిజె నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో గల పీస్ ప్యాలెస్ భవనంలో ఉన్న ‘గ్రేట్ హాల్ ఆఫ్ జస్టిస్’లో బహిరంగ విచారణ జరుపనుంది. జాదవ్ వివాదంలో ఇరు దేశాలు తమ వాదనలు వినిపించాలని ఐసిజె ఇప్పటికే భారత్, పాకిస్తాన్‌లను కోరింది. భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా గూఢచర్యానికి, విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డాడని పాక్ మిలిటరీ కోర్టు ఏకపక్షంగా నిర్ధారించడంతోపాటు అతనికి మరణశిక్ష విధించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుల్‌భూషణ్ జాదవ్ (46)కు ‘కాన్సులర్ యాక్సెస్’ కల్పించాలని తాను 16సార్లు చేసిన విజ్ఞప్తులను తిరస్కరించడం ద్వారా పాకిస్తాన్.. కాన్సులర్ సంబంధాలపై వియన్నా సదస్సు నిర్ణయాలను ఉల్లంఘించిందని భారత్ మే 8న ఐసిజె ముందు పిటిషన్ దాఖలు చేసింది.
గూఢచర్యంలో భాగంగా భౌగోళిక ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పాకిస్తాన్ నావికాదళ విమానం అట్లాంటిక్‌ను భారత వాయుసేన (ఐఎఎఫ్) 1999 ఆగస్టు 10న కచ్ ప్రాంతంలో కూల్చివేసింది. దీంతో ఆ విమానంలో ఉన్న మొత్తం 16 మంది నావికాదళ సిబ్బంది మృతిచెందారు. తన గగనతలంలో ఉన్న విమానాన్ని భారత్ కూల్చివేసిందని, అందువల్ల భారత్ నుంచి తనకు నష్టపరిహారంగా 60 మిలియన్ డాలర్లు ఇప్పించాలని కోరుతూ పాకిస్తాన్ ఐసిజెలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన 16 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసిజె ధర్మాసనం 2000 జూన్ 21న పాకిస్తాన్ వాదనను తోసిపుచ్చుతూ 14-2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ధర్మాసనం అధ్యక్షుడు ఫ్రాన్స్‌కు చెందిన గిల్‌బర్ట్ గుయిల్లెమ్ ఈ తీర్పును ప్రకటించారు. ఈ తీర్పే తుది తీర్పు. దీనిపై ఎలాంటి అప్పీలు జరుగలేదు. పాకిస్తాన్ 1999 సెప్టెంబర్ 21న దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే అధికారం తనకు లేదని ఐసిజె పేర్కొంది. ‘ఏరియల్ ఇన్సిడెంట్ ఆఫ్ ఆగస్టు 10, 1999 (పాకిస్తాన్ వర్సెస్ ఇండియా)’ శీర్షికతో జరిగిన పబ్లిక్ హియరింగ్ నాలుగు రోజులపాటు సాగి, 2000 ఏప్రిల్ 6న ముగిసింది. ఈ కేసులో కోర్టు అధికార పరిధి ప్రధానాంశంగా వాదనలు సాగాయి. పిటిషన్‌కు విచారణ యోగ్యత ఉందో లేదో నిర్ధారించడానికి ముందు కోర్టు అధికార పరిధిపై నిర్ణయం తీసుకుంటారు. విచారణ యోగ్యతపై కాకుండా కోర్టు పరిధి ఆధారంగానే ఐసిజె పాకిస్తాన్ పిటిషన్‌ను కొట్టివేసింది. భారత్ వాదించినట్లుగా ముందు కోర్టు పరిధిని నిర్ణయిస్తామని గుయిల్లెమ్ పేర్కొన్నారు. అప్పటి అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం కోర్టు అధికార పరిధిపై ప్రాథమికంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

నెదర్లాండ్స్ హేగ్ నగరంలోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ జస్టిస్’ (ఫైల్ ఫొటో)