బిజినెస్

4 ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: యూరియా ఉత్పత్తి విషయంలో దేశం స్వయం సమృద్ధి అయ్యేలా చూడడానికి, దిగుమతులు తగ్గించుకోవడం కోసం దేశంలో మూతపడిన నాలుగు ఎరువుల కర్మాగారాలను 2020-21 నాటికల్లా పునరుద్ధరించడానికి మిగులు నిధులు పుష్కలంగా ఉండే బొగ్గు, విద్యుత్, చమురు రంగాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు 30 వేల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, జార్ఖండ్‌లోని సింద్రి, ఒడిశాలోని తాల్చేర్, బిహార్‌లోని బరౌనీలలో మూతపడిన యూరియా ప్లాంట్లను పునరుద్ధరించడంతో పాటుగా తూర్పు ప్రాంతాన్ని దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు ఒక పైప్‌లైన్‌ను వేయడం కోసం ఈ కంపెనీలు దాదాపు 13 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నాయి. అంతేకాకుండా ఒడిశాలోని ధమ్రా వద్ద లిక్విఫైడ్ సహజవాయువు(ఎల్‌ఎన్‌జి)ను దిగుమతి చేసుకోవడం కోసం ఒక టెర్మినల్‌ను ఏర్పాటు చేయడానికి మరో 6000-8000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నాయని, ఇవన్నీ కలిపితే మొత్తం పెట్టుబడులు 55 వేల కోట్లకు చేరుకుంటాయని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. దేశంలో ఏటా 31-32 మిలియన్ టన్నుల యూరియా అవసరం కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 24.5 మిలియన్ టన్నులు మాత్రమే ఉందని, మిగతాది దిగుమతి చేసుకుంటున్నామని ఎరువుల శాఖ మంత్రి అనంత్‌కుమార్ చెప్పారు. ఈ నాలుగు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించడం వల్ల వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరుగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణాలోని రామగుండంలో పునరుద్ధరిస్తున్న మరో యూనిట్‌తో కలుపుకొని ఈ అయిదు యూనిట్ల ఉత్పాదక సామర్థ్యం ఏటా 7.5 మిలియన్ టన్నులని, దీంతో దేశం స్వయం సమృద్ధం అవుతుందని గురువారం ఇక్కడ ప్రధాన్, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోల్‌తో ప్లాంట్ల పునరుద్ధరణ పురోగతిని సమీక్షించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అనంత్‌కుమార్ చెప్పారు. ఎన్‌టిపిసి, కోల్ ఇండియా, ఐఓసి, గెయిల్‌లాంటి వాటి ప్రభుత్వ రంగ దిగ్గజాల తోడ్పాటుతో ఈ ఎరువుల కర్మాగారాలను పునరుద్ధర్తిన్నారు.