జాతీయ వార్తలు

కర్ణన్‌కు నో రిలీఫ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్‌కు మళ్లీ సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. జైలు శిక్ష తీర్పును వెనక్కి తీసుకోవాలన్న ఆయన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తమ క్లయింట్ అభ్యర్థనను విచారించాలంటూ మరోసారి కర్ణన్ న్యాయవాది చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. తక్షణ ప్రాతిపదికన ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించిన సుప్రీం కోర్టు ‘ఇది రావాల్సిన సమయంలోనే విచారణకు వస్తుంది’అని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కార కేసులో కర్ణన్‌కు ఆర్నెల్ల జైలు శిక్షను సుప్రీం కోర్టు బెంచి విధించినప్పటి నుంచి ఆయన అరెస్టు వ్యవహారం మలుపుల మయంగా మారింది. తీర్పు వెలువడి ఆరు రోజులు గడిచినప్పటికీ కర్ణన్ ఎక్కడున్నదీ ఎవరికీ అంతుబట్టడం లేదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌లలో అనే చోట్ల పోలీసు బృందాలు కర్ణన్ కోసం గాలిస్తున్నాయి. కర్ణన్ ఎక్కడికీ వెళ్లలేదని, చెన్నైలోనే ఉన్నారంటూ ఆయన తరపు న్యాయవాది మాధ్యూస్ నెదుంపర కోర్టుకు స్పష్టం చేసినప్పటికీ ఇంత వరకూ ఆయన ఆచూకీ తెలియనే లేదు. ఈ నేపథ్యంలో ఆయన దేశం వదిలి వెళ్లిపోయి ఉండవచ్చునన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. బహుశా శ్రీలంకకు ఆయన వెళ్లి ఉండవచ్చునన్న కథనాలూ వెలువడుతున్నాయి. ఓ న్యాయమూర్తే పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరగడం అన్నది దేశ భద్రతా వ్యవస్థపైనే అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది.