జాతీయ వార్తలు

రాజకీయాల్లోకి రజనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 15: సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై మొత్తం మీద పెదవి విప్పారు. భగవంతుడు తనను ప్రస్తుతం నటించమంటున్నాడని, ఆ భగవంతుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని ఆయన సోమవారం స్పష్టం చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలన్న కోరికలేమీ లేవని, అయితే దేవుడు కోరుకుంటే తాను పాటిస్తానన్నారు. చెన్నైలోని రాఘవేంద్ర వెడ్డింగ్ మాల్‌లో జరిగిన అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 700మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎలాంటి ఆకాంక్షలు లేవన్నారు. ‘‘మనం జీవితంలో ఏం చేయాలనేది ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. నన్ను నటుడుగా పనిచేయమన్నాడు కాబట్టి నేను నటుడిగా ఉన్నాను. రేపు రాజకీయాల్లోకి ప్రవేశించమని ఆదేశిస్తే అలాగే చేస్తాను. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రవేశం ఫలవంతంగా ఉండాలి. డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చేవారితో నేను పనిచేయను’’ అని రజనీకాంత్ స్పష్టం చేశారు. 66 ఏళ్ల రజిని తాను 1996లో ఓ రాజకీయ కూటమికి మద్దతునివ్వటం ఓ ఆక్సిడెంట్ అని తెలిపారు. 1996లో డిఎంకె కూటమికి మద్దతునిచ్చి, జయలలితకు వ్యతిరేకంగా రజనీ ప్రచారం కూడా చేశారు. పోయెస్ గార్డెన్ ప్రాంతంలో జయలలిత ఇంటి పొరుగునే ఉండే రజిని ఆమె ముఖ్యమంత్రి అయితే తమిళనాడును దేవుడు కూడా బాగు చేయలేడంటూ కూడా నాడు ఆరోపించారు. ఆ ఎన్నికల్లో డిఎంకె కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. జయలలిత నాటి ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయింది. అయితే ఇదే రజనీకాంత్ జయలలిత మరణానంతరం మాట్లాడుతూ, తాను ఆమెను బాధపెట్టానని, ఆమె ఒక వజ్రమని అభివర్ణించారు. ‘‘21 ఏళ్ల క్రితం నేను ఒక రాజకీయ కూటమికి మద్దతునివ్వటం ఒక యాక్సిడెంట్. అప్పటి నుంచి రాజకీయ నాయకులు నా పేరును అనేక సందర్భాల్లో నా పేరును దుర్వినియోగం చేశారు. రాజకీయాల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవటం లేదు’’ అని ఆయన అభిమానులకు స్పష్టం చేశారు. ఈ ఏడాది తొలినాళ్ల నుంచి రజనీకాంత్ కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. జయలలిత చనిపోయిన తరువాత ఆమె పార్టీ అన్నాడి ఎంకె రెండుగా చీలిపోయి అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కార్యక్రమం అనంతరం రజనీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు.