జాతీయ వార్తలు

ఆ నిధులు నిర్మాణ కార్మికుల సంక్షేమానికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సెస్‌ద్వారా సమకూర్చిన నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సిందేనని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. 2017 మార్చినాటికి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణంలో సెస్ విధింపు ద్వారా రూ.1153 కోట్లు వసూలు చేసిందని సోమవారం ఇక్కడ తెలిపారు. అందులో రూ.205 కోట్ల కార్మికుల సంక్షేమానికి వినియోగించగా, తెలంగాణ రూ.443కోట్లు వసులు చేసి రూ.98 కోట్లు వారి సంక్షేమానికి ఖర్చు చేసిందని దత్తాత్రేయ తెలిపారు. ఏపీ భవన్‌లో దత్తాత్రేయ విలేఖరులతో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వాలు సెస్ విధిస్తున్నాయని అన్నారు. ఆ సొమ్ములనకు కార్మికుల సంక్షేమం కోసమే వినియోగించాలని మంత్రి చెప్పారు. అయితే ఢిల్లీ, ఏపీ, తెలంగాణతోసహా వివిధ రాష్ట్రాలు ఈ నిధులను ఖర్చు చేయడం లేదని, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నరని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సమాకుర్చిన నిధుల వినియోగంపై సుప్రీం కోర్టు కార్మిక శాఖలను, రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరిందని మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నియమావళిని సుప్రీం కోర్టుకు కేంద్ర కార్మిక శాఖ సమర్పించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రాల ట్రెజరీల్లో ఇలా వినియోగించకుండా ఎంతమొత్తంలో నిధులున్నయో తెలిపాలని కాగ్‌ను కూడా సుప్రీం ఆదేశించినట్టు దత్తాత్రేయ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రూ.32,480కోట్లు సెస్ విధింపుల ద్వారా వసూలు చేయగా, కేవలం రూ.7,286 కోట్లు మాత్రమే వినియోగించినట్టు ఆయన తెలిపారు. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడంతోపాటు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక శాఖల్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని బండారు దత్తాత్రేయ చెప్పారు.
సలహామండలి అధ్యక్షుడిగా వెదుర్లపల్లి
కేంద్ర భవన నిర్మాణాల కార్మిక సలహా మండలి అధ్యక్షుడిగా ఏపీకి చెందిన వెదుర్లపల్లి శ్రీనివాస్‌నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వెదురుపల్లి విలేఖరులతో మాట్లాడుతూ తనను పదవిలో నియమించిన కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలకు కృతజ్ఞతలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.