జాతీయ వార్తలు

నదులను రక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమర్‌కాంతక్ (మధ్యప్రదేశ్), మే 15: దేశంలో నదుల నిర్వహణా వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక నదుల్లో చుక్కనీరులేని దుస్థితి నెలకొందని సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. ‘మనకు ఇన్ని నదులున్నాయని మ్యాపుల్లో చూపడమే తప్ప. వాటిలో నీళ్లే ఉండడం లేదు’ అని ఆయన అన్నారు. ‘నమామీ దేవి నర్మదే సేవాయాత్ర’ ముగింపు కార్యక్రమం మధ్యప్రదేశ్‌లోని అన్నూప్పూర్ జిల్లాలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నదుల పరిరక్షణకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నర్మదా పరిరక్షణ రోడ్ మ్యాప్‌ను మోదీ ప్రశసించారు. భవిష్యత్‌కు ఇదో దిక్చూచిలా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలను దీన్లో భాగస్వామ్యం చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన సూచించారు. మధ్యప్రదేశ్ రూపొందించిన రోడ్ మ్యాప్ భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న ప్రధాని ‘ఇది కచ్చితంగా మంచి డాక్యుమెంట్’ అని ప్రసంశించారు. ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా చౌహాన్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నమానీ దేవీ నర్మదే సేవా యాత్ర 2016 డిసెంబర్ 11న ప్రారంభమై 150 రోజులు సాగింది. 3,344 కిలోమీటర్లు, 1,100 గ్రామాలు, పట్టణాల గుండా యాత్ర సాగింది. ‘నర్మదాలోని ప్రతి నీటిబొట్టు మాకెంతో ముఖ్యం. గుజరాత్ ప్రజల తరఫున నేనీ విషయం చెబుతున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి రాజస్థాన్, మహారాష్ట్ర అభినందలు తెలుపుతున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. నదీ జన్మస్థానం అమర్‌కాంతక్‌లో తొలుత ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

చిత్రం..‘నర్మదే సేవా యాత్ర’ ముగింపు కార్యక్రమంలో ప్రజలకు అభివాదం చేస్తున్న
ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్