జాతీయ వార్తలు

పిఎం పదవి రేసులో లేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మే 15: తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తిలేదని, ప్రధాన మంత్రి పదవి రేసులో లేనని బిహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘మాది ఓ చిన్న పార్టీ. దానికి నేను అధ్యక్షుడిని అంతే. నేను జాతీయ రాజకీయాలపై కనే్నసినట్టు జరుగుతున్న ప్రచారం నిజంకాదు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రధాన మంత్రి పదవి రేసులో లేను. రాష్ట్భ్రావృద్ధే జెడి(యు) ధ్యేయం’ అని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ ‘లోక్ సంవాద్’ కార్యక్రమం సందర్భంగా నితీశ్ కుమార్ మాట్లాడుతూ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, సిఎంగా బిహార్ అభివృద్ధికే పాటుపడ్డానని అన్నారు. తనపై విశ్వాసంతోనే రాష్ట్ర ప్రజలు జెడి(యు)కి సారథ్యం వహించే అవకాశం కల్పించారని ఆయన చెప్పారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తిలేదని పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా పనిచేస్తున్నారని నితీశ్ ప్రశంసించారు. అన్ని రాజకీయ పార్టీలకు ఒకే అభిప్రాయంతో ఉండాల్సిన అవసరం లేదని, ఇవిఎంల ట్యాంపరింగ్‌పై ఆర్జేడి లేవనెత్తిన అనుమానాలపై ప్రస్తావించగా వ్యాఖ్యానించారు. కాగా రాష్టప్రతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి బిజెపి కృషి చేయాలని నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రణబ్ ముఖర్జీని రెండోసారి కొనసాగించాలని అన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయని అన్నారు. ఏకాభిప్రాయం సాధించడానికి అధికార పార్టీ కృషిచేస్తే బాగుంటుందని అన్నారు. అధికార పార్టీ అలాంటి ప్రయత్నాలు చేయకపోతే ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతాయని నితీశ్ స్పష్టం చేశారు.

చిత్రం..పాట్నాలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్