జాతీయ వార్తలు

జతకుదిరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, మార్చి 25: కాశ్మీర్‌లో రెండు నెలల రాజకీయ సంక్షోభానికి తెరపడింది. విభేదాలను పక్కన పెట్టి పిడిపి, బిజెపిలు మళ్లీ చేతులు కలిపాయి. శనివారం గవర్నర్ ఎన్‌ఎన్ వోరాను కలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయాలని ఇరు పార్టీలు శుక్రవారం నిర్ణయించుకున్నాయి. 58ఏళ్ల పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కొత్త సర్కార్ ఏర్పడబోతోంది. పిడిపి శాసన సభా పక్ష నేతగా ఆ పార్టీ శాసన సభా పక్షం మెహబూబాను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో బిజెపి శాసన సభా పక్షం కూడా శుక్రవారం సమావేశమై నిర్మల్ సింగ్‌ను తమ నేతగా ఎంపిక చేసుకుంది.కొత్త మంత్రివర్గంలో నిర్మల్ సింగ్‌కు మళ్లీ ఉపముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. శనివారం గవర్నర్‌ను కలుసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ మెహబూబా ఆయనకు లేఖ ఇస్తారు. అలాగే ఆమెకు మద్దతుగా బిజెపి కూడా లేఖ అందిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు రెండు పక్షాలను విడివిడిగా పిలిపించుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి గవర్నర్ చర్చించారు. నిజానికి ఇవాళే కొత్త ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం తేలాల్సి ఉన్నప్పటికీ ఇరు పక్షాలు శనివారం వరకూ గడువు కోరారు. విడివిడిగా గవర్నర్‌ను కలుసుకోవడం కంటే సంయుక్తంగానే ఆయన్ని కలుసుకుని పరిస్థితిని వివరిస్తే బావుంటుందన్న అభిప్రాయం ఇరు పక్షాల్లోనూ వ్యక్తమైంది. జమ్ములో జరిగిన బిజెపి శాసన సభాపక్ష సమావేశానికి హాజరైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ‘పిడిపి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’అని ప్రకటించారు.

చిత్రం జమ్మూలో జరిగిన బిజెపి శాసనసభాపక్ష సమావేశంలో రాంమాధవ్, జితేంద్రసింగ్ తదితరులు