జాతీయ వార్తలు

శాంతి స్థాపనకు సంపూర్ణ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: శాంతికోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ దిశగా పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య చర్చలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మంగళవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. ఐదింటిపై మోదీ, అబ్బాస్ సంతకాలు చేశారు. ఇద్దరు నాయకులు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
పలు అంతర్జాతీయ, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు దేశాధినేతలు చర్చించారు. మధ్య ఆసియా దేశాల్లో శాంతికోసం జరుగుతున్న ప్రక్రియపై ప్రధానంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకునేందుకు పరస్పర సహకారం అందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మోదీ, అబ్బాస్ మధ్య జరిగిన సమావేశం శాంతి, స్నేహానికి దోహదపడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి గోపాల్ బగ్లే ట్వీట్ చేశారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరుదేశాల అధినేతలు భేటీ అయ్యారు. అంతకుముందు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌ను కలిశారు. రాష్టప్రతి భవన్ వద్ద ఉదయం పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌కు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన భారత్‌కు వచ్చారు. కాగా జూలైలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.

చిత్రం..పాలరాతి ముక్కలతో తీర్చిదిద్దిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని
బహూకరిస్తున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్