జాతీయ వార్తలు

సోనియాతో మమత భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకుని కొత్త రాష్టప్రతి ఎన్నికలో ప్రతిపక్షం అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించారు. ఆనారోగ్యంతో గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. సోనియా గాంధీ గత వారం మమతా బెనర్జీకి టెలిఫోన్ చేసి కొత్త రాష్టప్రతి ఎన్నికకోసం ప్రతిపక్షం అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు ఢిల్లీకి ఆహ్వానించారు. రాష్టప్రతి ఎన్నిక నేపథ్యంలో అధికార, ప్రతిపక్షం బలాబలాలపై ఇరువురు నాయకులు సమీక్షించినట్లు తెలిసింది. నరేంద్ర మోదీ రాష్టప్రతి పదవికి ఎవరి పేరు ప్రతిపాదిస్తారనేది ఎవ్వరికీ అంతుపట్టటం లేదు. ఈ వ్యవహారంలో ప్రతిపక్షం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఎవరిని రంగంలోకి దించితే మోదీ ఖంగు తింటారనే అంశాలను సోనియాగాంధీ, మమతా బెనర్జీ చర్చించారని అంటున్నారు. జూన్ రెండో వారంలో కొత్త రాష్టప్రతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతున్నందున ప్రతిపక్ష అభ్యర్థిని వీలున్నంత త్వరగా ఖరారు చేసుకోవాలని భావిస్తున్నారు. సోనియా గాంధీ నాలుగైదు రోజుల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మరికొందరు సీనియర్ నాయకులతో సమావేశమై ప్రతిపక్షాల తరపున పోటీచేసే అభ్యర్థి పేరును ఖరారు చేయవచ్చునని చెబుతున్నారు.

చిత్రం..ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ