జాతీయ వార్తలు

విద్యా ప్రమాణాలు పెంచేందుకు మరిన్ని సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: పాఠశాల విద్యలో డిటెన్షన్, నో-డిటెన్షన్ విధానం అమలుపై త్వరలో చట్టం తీసుకురానున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. నో-డిటెన్షన్ విధానం కొనసాగించాలా వద్దా అనేది రాష్ట్రాలకే పూర్తి నిర్ణయాధికారం ఉంటుందని ఆయన చెప్పారు. ఉపాధ్యాయ శిక్షణలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు సంస్కరణలు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్లలో కేంద్ర మానవ వనరుల శాఖ సాధించిన ప్రగతిపై ఢిల్లీలో ప్రకాశ్ జావడేకర్ విలేఖరులతో మాట్లాడుతూ ‘అందరికీ విద్య నాణ్యమైన విద్య’ అన్న నినాదంతో కేంద్ర మానవ వనరుల శాఖ ముందుకెళ్తోందని చెప్పారు. గత మూడేళ్లలో 59 కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించామని, మరో 50 కొత్త విద్యాలయాలకు మంజూరు చేసినట్టు తెలిపారు. వాటితో పాటుగా 62 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది కొత్తగా బి.ఎడ్ కాలేజీలకు అనుమతి ఇచ్చేది లేదని, ప్రస్తుతం ఉన్న కాలేజీల విద్యా ప్రమాణాలు బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలలో నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా 20 ప్రపంచస్థాయి విద్యా సంస్థలను తయారు చేయాలని నిర్దేశించుకొన్నట్టు పేర్కొన్నారు. నవోదయ విద్యాలయల్లో ప్రమాణాలు పెంచడం వలన గత ఏడాది 481 మంది విద్యార్థులు ఐఐటిల్లో చేరినట్టు చెప్పారు. ప్రపంచలోనే అతిపెద్దదిగా నడుస్తున్న మధ్యాహ్న భోజన పథకం దేశవ్యాప్తంగా 11.5 లక్షల పాఠశాలలో 10 కోట్ల మంది విద్యార్థులకు పోషక ఆహారంగా అందిస్తున్నామని అన్నారు. హాకథాన్ పథకంద్వారా విద్యా వ్యవస్థలో ఇప్పటివరకు 600 సమస్యలకు పరిష్కారం చూపినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ఒకే ప్రవేశ పరీక్ష ‘నీట్’లానే ఇంజనీరింగ్ విద్యలో కూడా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను తీసుకొచ్చే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు.