జాతీయ వార్తలు

వాళ్లపై ఓ కనే్నయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: మత అతివాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈశాన్య రాష్ట్రాలను హెచ్చరించారు. దీనిపై అప్రమత్తంగా లేకపోతే తీవ్రవాదానికి దారితీసే ప్రమాదం ఉందని అన్నారు. మంగళవారం ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఆక్రమ ఆయుధాల వ్యాప్తి, స్మగ్లింగ్‌ను నిరోధించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిజిపిలను ఆదేశించారు. మతం పేరుతో ప్రజలను తప్పుదోవపట్టించే వారిపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘్భద్రతకు సంబంధించి మత అతివాదం పెనుసవాల్‌గా మారింది. అదో జాతి వ్యతిరేక కార్యక్రమంగా రూపుదిద్దుకుని తీవ్రవాదంగా మారే ప్రమాదం ఉంది’ అని రాజ్‌నాథ్ హెచ్చరించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోని పక్షంలో పరిస్థితి చేయిదాటిపోతుందని డిజిపిలతో ఆయన అన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా పలువురు సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో మత అతివాదం వెనక ఉన్న శక్తులను గుర్తించాలని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ‘కొందరు మతం పేరుతో మరికొందరు ఎన్‌జివోల పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. వ్యక్తిగత లబ్ధి, అభివృద్ధి, విద్య పేరుతో ప్రజలతో సంబంధాలు నెరపుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలపై అధికారులు ఓ కనే్నసి ఉంచాలని హోమ్‌మంత్రి పిలుపునిచ్చారు. కొందరు విదేశీ విరాళాలను పొందుతూ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెన్సీ ప్రభావం పెద్దగా లేదని, అయితే అక్రమ ఆయుధాల సమస్య ఉందని మంత్రి వివరించారు. అక్రమ ఆయుధ వ్యాపారులకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలని ఆయన ఆదేశించారు. అలాగే ఆయుధాలు, నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాలు అంతర్జాతీయ సరిహద్దులు దాటి వస్తోందని హోమ్‌మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల వెంబడి మరిన్ని పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అసరం ఉందని ఆయన చెప్పారు.

చిత్రం..ఢిల్లీలో మంగళవారం జరిగిన ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిల
ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్