జాతీయ వార్తలు

పెద్ద నోట్ల రద్దే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్వరంతో అన్నారు. ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని, దీని ప్రభావం ఉపాధి అవకాశాల సృజనపైనా పడే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన మన్మోహన్ ఆర్థిక వృద్ధి రేటు మందగించడానికి దారితీసిన కారణాలను విశే్లషించారు. మిగతా కారణాల కంటే కూడా ప్రధాని మోదీ గత ఏడాది నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో క్రియాశీలతకు స్థూల విలువ చేర్పు (జివిఏ) కీలకమని, ఇటీవలి కాలంలో ఇదీ పడిపోతూనే వచ్చిందని గుర్తు చేశారు. ప్రైవేటు రంగ పెట్టుబడులూ కుప్పకూలి పోయాయని, పబ్లిక్ స్పెండింగ్ అన్న ఏకైక ఇంజనే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోందన్నారు. నిరుద్యోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. దేశంలో అత్యధిక స్థాయిలో ఉపాధి అవకాశాల్ని కల్పించే నిర్మాణ రంగం కూడా తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. వీటన్నింటి పర్యవసానంగా కోటాను కోట్లుగా ఉపాధి అవకాశాల్ని కోల్పోయినట్టే అయిందన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనది కాదని పేర్కొన్న మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం దీని ప్రభావం జిడిపిపైనా, ఆర్థిక వ్యవస్థపైనా తీవ్రంగానే ఉంటుందని అన్నారు.

చిత్రం.. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మన్మోహన్ సింగ్. చిత్రంలో రాహుల్, సోనియా