జాతీయ వార్తలు

మీ చేతగానితనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: జమ్మూ కాశ్మీర్‌లో శాంతి భద్రతలను కాపాడడంలో కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సోనియాగాంధీ ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజూ మరణాలు సంభవిస్తున్నాయని, దానికి ఎన్‌డిఏ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని ఆమె దుయ్యబట్టారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్థికాభివృద్ధి పడిపోతుందంటూ మన్మోహన్ సింగ్ చేసిన హెచ్చరిక ఇప్పుడు నిజమవుతోందని ఆమె చెప్పారు. మేక్ ఇన్ ఇండియా యువతకు ఉపాధి కల్పించటంలో విఫలమైందని సోనియా దుయ్యబట్టారు. రైతులు కరవుతో అష్టకష్టాలు పడుతుంటే ఎన్‌డిఏ ప్రభు త్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఎన్‌డిఏ ప్రభుత్వం జవాబుదారితనాన్ని దెబ్బ తీస్తోంది, న్యాయ వ్యవస్థను నీరు కారుస్తోందని కాంగ్రె స్ అధ్యక్షురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్‌డిఏ ప్రభుత్వం ఘోల వైఫల్యానికి జమ్మూకాశ్మీర్ పరిస్థితులు తాజా ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. కేంద్రం విభజన విధానాన్ని అవలంభించటం వల్లనే కాశ్మీర్‌లో అశాంతి నెలకొందని ఆమె అన్నా రు. ఎన్‌డిఏ ప్రభుత్వం అసమ్మతిని అణచివేస్తోందని ఆమె చెప్పారు. ఇటీవల ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు కనువిప్పు కావాలని సోనియా గాంధీ పార్టీ నాయకులకు సూచించారు. 2019 ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుండే సిద్ధం కావాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయటం ద్వారా కాంగ్రెస్‌ను మరింత పటిష్టం చేసుకోవాలన్నారు.

చిత్రం..సోనియాగాంధీ