జాతీయ వార్తలు

సిపిఎం ఆరోపణలు నిరాధారం: ఆర్‌ఎస్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: సిపిఎం ప్ర ధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై దాడికి యత్నించిన ఘటనకు కార ణం సంఘ్ శక్తులంటూ ఆ పార్టీ చేసి న ఆరోపణలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ప్రజాస్వామ్య, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆర్‌ఎస్‌ఎస్ ఎన్నడూ ప్రోత్సహించదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై సిపిఎం పార్టీ సంఘ్ పరివార్ శక్తులు అంటూ చేసిన నిరాధారామైన ఆరోపణలను ఆర్‌ఎస్‌ఎస్ ఖండించింది. ఈ వ్యవహారంలో విమర్శలు చేయడంపై స్పందిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశంలో పెరుగుతున్న ఆదరణ, వృద్ధిని గురించి సిపిఎం పార్టీ ఆందోళనకు చెందుతుందని విమర్శించింది. బుధవారం ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి డా.మన్‌మ్మోహన్ వైద్య పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది.