జాతీయ వార్తలు

కేంద్ర మంత్రి నడ్డాకు డబ్ల్యూహెచ్‌ఓ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: పొగాకు మహమ్మారి నుంచి ప్రజలను జాగృతం చేయడంతోపాటు ఉత్పత్తులవల్ల వచ్చే దుష్పరిణామాలు నిరోధించడానికి కృషిచేస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డాకు అరుదైన పురస్కారం దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ నుంచి ప్రత్యేక అవార్డును నడ్డాకు ప్రకటించారు. డబ్ల్యూహెచ్‌ఓ దక్షిణ-తూర్పు ఆసియా రీజనల్ డైరెక్టర్ పూనం ఖేత్రాపాల్ సింగ్ కేంద్ర మంత్రి నడ్డాకు ఈ అవార్డు అందజేశారు. తన మంత్రిత్వశాఖ, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, పౌర సంఘాల భాగస్వామ్యంతో దేశంలో పొగా కువల్ల కలిగే దుష్పరిణామాలు జనంలోకి తీసుకెళ్లినట్టు నడ్డా ఈ సందర్భంగా ప్రకటించారు. ముందు పేద ప్రజల జీవితాలను పొగాకు చిన్నాభిన్నం చేస్తోందని, అక్కడి నుంచి సమాజం దాని తరువాత దేశం మొత్తం దాని బారిన పడుతోందని మంత్రి అన్నారు. పొగతాగే దురలవాటును పారదోలడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన హయాంలో 81 లక్షల మంది యువత పొగాకు వాడకానికి దూరం కావడం ఎంతో సంతోషం కలిగిస్తోందని నడ్డా చెప్పారు.

చిత్రం.. కేంద్ర మంత్రి నడ్డాకు ప్రత్యేక అవార్డును అందజేస్తున్న దక్షిణ-తూర్పు ఆసియా రీజనల్ డైరెక్టర్ పూనం ఖేత్రాపాల్ సింగ్