జాతీయ వార్తలు

జూలైలో ఇజ్రాయెల్‌కు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌ను సందర్శిస్తున్న తొలి భారత ప్రదాని మోదీయే కావడం గమనార్హం. ప్రధాని మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటన జూలై 4న ప్రారంభమవుతుందని, అదే రోజు సాయంత్రం ఆయన ఇజ్రాయెల్పధాని బెంజమి నెతన్యాహుతో సమావేశమవుతారని పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. రష్యా తర్వాత భారత్ సైనిక పరికరాలను ఇజ్రాయెల్‌నుంచి అధికంగా కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 5న ఇజ్రాయెల్‌లోని భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. మోదీ పర్యటనకోసం ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఇప్పటికే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు కూడా. ఇజ్రాయెల్‌లో భారత సంతతికి చెందిన దాదాపు 80 మంది యూదులు నివసిస్తున్నారు. కాగా, మోదీ, నెతన్యాహులు రెండు సార్లు ఐక్యరాజ్య సమితికి చెందిన కార్యక్రమాల నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు కలుసుకున్నారు. గత ఏప్రిల్‌లో మన దేశం తన ఆర్మీ,నేవీ కోసం క్షిపణులను కొనుగోలు చేయడం కోసం ఇజ్రాయెల్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఏరోస్పేస్‌తో 200 కోట్ల డాలర్ల విలువైన ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇజ్రాయెల్‌తో మన దేశం చేసుకున్న అతి పెద్ద రక్షణ ఒప్పందం ఇదే కావడం గమనార్హం. కాగా, ఇజ్రాయెల్‌తో ప్రధాని మోదీ బంధం ఈ నాటిది కాదు. 2006లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయంలో కొత్త ఆలోచనల అనే్వషణకై ఇజ్రాయెల్‌ను సందర్శించారు. కాగా, ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు సన్నాహకంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఆ దేశాన్ని సందర్శించారు.