అంతర్జాతీయం

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తానా, జూన్ 8: షాంఘై సహకార సమాఖ్య (ఎస్‌ఓసి) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం కోసం ప్రదాని నరేంద్ర మోదీ గురువారం రెండు రోజుల పర్యటనపై కజకిస్తాన్ రాజధాని ఆస్తానాకు చేరుకున్నారు. భారత్, పాకిస్తాన్‌లను ఈ సమావేశాల్లోనే షాంఘై సహకార సమాఖ్యలో సభ్య దేశాలుగా చేర్చుకోనున్నారు. 2001లో షాంఘై సహకార సమాఖ్య ఏర్పాటయిన తర్వాత దాన్ని విస్తరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు చైనా ఆధిపత్యం కొనసాగిన ఈ కూటమిలో ఇప్పుడు భారత్ చేరిక ఓ మైలురాయని చెప్పవచ్చు. దీంతో ఈ ప్రాంత భౌగోళిక-రాజకీయాలు, వాణిజ్య చర్చల్లో దీని ప్రాధాన్యత పెరగడమే కాకుండా ఈ కూటమి మొత్తం ఆసియాకు ప్రాతినిధ్యం వహించే గ్రూపుగా సరికొత్త రూపు సంతరించుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సదస్సునుద్దేశించి ప్రసంగించనున్నారు. అదే రోజు ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా భేటీ కానున్నారు. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్, అణు సరఫరా దేశాల గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకోవడం సహా అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఇరువురు నేతలు సమావేశమవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సదస్సు నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, మోదీ మధ్య సమావేశం జరగవచ్చంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ అలాంటి ప్రతిపాదన ఏదీ పాక్ వైపునుంచి కానీ, భారత్‌వైపునుంచి కానీ లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రధాని మోదీ తన రెండు రోజుల పర్యటనలో కజకిస్థాన్ అధ్యక్షుడు నుర్‌సుల్తాన్ నజర్‌బయేవ్ సహా సదస్సుకు హజరవుతున్న పలు దేశాల నేతలను కూడా కలుసుకోనున్నారు. షాంఘై సహకార సమాఖ్యలో భారత్‌ను సభ్యురాలిగా చేర్చుకునే ప్రక్రియ 2015 జూలైలోనే మొదలైంది. భారత్, పాక్‌లకు సభ్యత్వాన్ని మంజూరు చేయడానికి పాలనాపరమైన అడ్డంకులను తొలగించుకోవడంతో ఈ రెండు దేశాలు కూటమిలో సభ్యులుగా చేరడానికి మార్గం సుగమం అయింది. భారత్, పాక్‌లు షాంఘై సహకార సమాఖ్యలో చేరడంతో ఈ గ్రూపు మరో 145 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే కూటమిగా మారనుంది. దీంతో ప్రపంచ జనాభాలో 40 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే కూటమిగా ఇది మారనుంది.
2001లో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షులు షాంఘైలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో షాంఘై సహకార సమాఖ్యను ఏర్పాటు చేవారు. 2005నుంచి భారత్, పాక్‌లో పరిశీలకుల హోదాలో షాంఘై సహకార సమాఖ్య సమావేశాల్లో పాల్గొంటూనే ఉన్నాయి.

చిత్రం.. గురువారం ఆస్తానాలో కజకిస్థాన్ అధ్యక్షుడు
నుర్‌సుల్తాన్ నజర్‌బయేవ్‌ను కలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ