జాతీయ వార్తలు

ఆధార్‌కు పాక్షిక బ్రేకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: పాన్‌కార్డుల జారీకి, అలాగే ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఆదాయం పన్ను చట్టంలో చేర్చిన నిబంధనను సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది. అయి తే ప్రైవసీ హక్కు అంశంపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువడే దాకా దాని అమలును పాక్షికంగా నిలిపివేసింది. పాన్-ఆధార్ లింకేజిని తప్పనిసరి చేస్తూ ఆదాయం పన్ను చట్టంలో చేర్చిన 139ఎఎ సెక్షన్‌ను సమర్థించిన న్యాయమూర్తులు ఎకె సిక్రి, అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచ్ అయితే ఈ విషయంలో ప్రజలను బలవంతం పెట్టకూడదని స్పష్టం చేసింది. అయితే ఆధార్ పథకం ప్రైవసీ హక్కుకు విరుద్ధమని, దీనివల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరుపుతోంది. తాము ఈ అంశాల జోలికి వెళ్లడం లేదని, రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాలను నిర్ణయిస్తుందని పేర్కొన్న బెంచ్ ఆధార్ పథకంనుంచి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా చూడడానికి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ పథకం వల్ల సమాచారం ఏదీ లీక్ కాదని ప్రజల్లో విశ్వాసం కలిగే దాకా వీలయినంత త్వరగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని బెంచ్ ప్రభుత్వానికి సూచించింది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువడే దాకా ఆధార్‌నంబర్ లేని పాన్ కార్డులను రద్దు చేయవద్దని కూడా బెంచ్ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలై 1నుంచి బ్యాంక్ ఖాతాలు తెరవడానికి, పాన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ఐటి రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఆర్థిక చట్టంలో సవరణలు చేయడం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ దాఖలయిన పలు పిటిషన్లపై విచారణను బెంచ్ గత మే నెల 4న ఈ రోజుకు వాయిదా వేయడం తెలిసిందే. కాగా, ఆదాయం పన్ను చట్టం 139ఏ ప్రకారం ఐటి రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు పాన్ నంబర్ జత చేయడం తప్పనిసరి అని.. ఇప్పుడు దానికి ఆధార్‌ను కూడా జత చేయమని కోరుతున్నామని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తెలియజేశారు.