జాతీయ వార్తలు

ఎంపీ పాల్వాయి హఠాన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి శుక్రవారం ఉదయం హిమాచల్‌ప్రదేశ్ మనాలీ సమీపంలోని కులు లోయలో గుండెపోటుతో కన్నుమూశారు. గోవర్దన్ రెడ్డి రాజ్యసభ స్టాండింగ్ కమిటీ పర్యటన సందర్భంగా శుక్రవారం ఉదయం కులు లోయలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. గోవర్దన్ రెడ్డితో ప్రయాణిస్తున్న స్టాండింగ్ కమిటీలోని తెరాస ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి మరికొందరు ఎంపీలు ప్రాథమిక వైద్యం అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుప్పకూలిన గోవర్దన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించే సమయానికే ఆయన తుది శ్వాస విడిచారు. కులు లోయలో గుండెపోటుతో మరణించిన గోవర్దన్ రెడ్డి భౌతికకాయాన్ని సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఆయన నివాసానికి తీసుకొచ్చి, ప్రజల, పార్టీ నేతల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి కుమార్తె శ్రవంతి, మరో నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి ఢిల్లీకి వచ్చి గోవర్దన్ రెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాదుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ అధ్యక్షుడు, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, ఉపాధ్యక్షుడు పిజె కురియన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నాయకుడు ఏకె ఆంటోనీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్‌రావు, ఎంఏఖాన్, పాల్వాయి గోవర్దన్ రెడ్డి సన్నిహిత మిడ్రుతు, మాజీ గవర్నర్ ఎన్‌డి తివారీ, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కార్యదర్శి రాజా తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు గోవర్దన్ రెడ్డి భౌతిక కాయంపై పుష్చగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఢిల్లీలో తెరాస ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ అరవిందకుమార్ తదితరులు శ్రద్దాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. పాల్వాయి తమ మధ్య లేకపోవటాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోవర్దన్ రెడ్డి స్వగ్రామం చండూరులో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు. గోవర్దన్ రెడ్డి పార్థివ దేహాన్ని బుధవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో రెండు గంటలపాటు ఉంచి, అభిమానులు, ప్రజలు, నేతల సందర్శనార్థం గాంధీ భవన్‌కు తీసుకొస్తామన్నారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని చుండూరుకు తీసుకెళ్తామన్నారు.
కలిసి ప్రయాణం చేశాం
గోవర్దన్ రెడ్డి శుక్రవారం ఉదయం ఢిల్లీలో విమానం ఎక్కే సమయంలోనే అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. ఆయన ఇప్పుడే జాగ్రత్త తీసుకుని ఉంటే, ప్రమాదం తప్పి ఉండేదని తెలుస్తోంది. తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం మనాలీ వెళ్లేందుకు శుక్రవారం ఉదయం ఢిల్లీలో విమానం ఎక్కే సమయంలోనే గోవర్దన్ రెడ్డి ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. దీంతో ర్యాంప్ ద్వారా విమానంలోకి ఎక్కించాల్సి వచ్చిందని ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. విమానంలో ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నప్పుడు కాలు లాగుతోందని ఆయన చెప్పారు. కానీ మనాలీ చేరిన తరువాత ఇలా జరుగుతుందని ఊహించలేకపోయామని ఆయన బాధను వ్యక్తం చేశారు. మనాలీ చేరిన తరువాత తమ కమిటీలో ఉన్న వైద్యులు ఆయనకు పరీక్షించారని, ఎందుకైనా మంచిదని అంబులెన్సు తెప్పించి ఆసుపత్రికి పంపించామని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మనాలీలో తనతో కాఫీ తాగిన పాల్వాయికి, ఇలాంటి ప్రమాదం సంభవిస్తుందని ఊహించలేకపోయామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు ప్రత్యేక విమానంలో మనాలీ నుండి ఢిల్లీకి తీసుకొచ్చామని ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

చిత్రం.. పాల్వాయకి నివాళి అర్పిస్తున్న రాహుల్‌గాంధీ