జాతీయ వార్తలు

సివిల్ జడ్జీలు పరీక్షకు అర్హులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా న్యాయమూర్తుల అర్హత పరీక్షను సివిల్ జడ్జీలు రాసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఏపీ, తెలంగాణల్లో జిల్లా న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి ఉమ్మడి హైకోర్టు ఏప్రిల్ 15ననోటిఫికేషన్ విడుదల చేస్తూ, శిక్షణ న్యాయవాదులకు మాత్రమే పరీక్షకు అర్హులుగా పేర్కొంది. దీనిపై తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 40 మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషన్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. సివిల్ జడ్జీలు, జిల్లా జడ్జీల పరీక్షకు అర్హులుగా గతంలో జస్టిస్ చలమేశ్వర్‌తో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను కోర్టు దృష్టికి పిటిషనర్ల తరపు న్యాయవాది వర్నం ప్రభాకర్ తీసుకొచ్చారు. గతంలో ఆదేశాల ప్రకారం పిటిషనర్లను పరీక్షకు అనుమతినివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో కోర్టును ఆశ్రయించిన సివిల్ జడ్జీలకు, జిల్లా న్యాయమూర్తుల ప్రవేశ పరీక్షకు హాజరుకావొచ్చునని ఆదేశించింది.