జాతీయ వార్తలు

రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 9: రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి, 2022 నాటికి వారి రాబడిని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం యత్నిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌సహా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా డుడు పట్టణం లో శుక్రవారం జరిగిన ఓ బహిరంగ సభలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని పాలించిందని, అయితే బిజెపి ప్రభుత్వాలు అద్భుతంగా పని చేశాయని చెప్పారు. దేశాన్ని ఆర్థిక శక్తిగా తయారుచేసే దిశగా అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం పని చేసిందని, ద్రవ్యోల్బణాన్ని విజయవంతంగా అదుపు చేయగలిగిందని ఆయన అన్నా రు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ నినాదమైన ‘జై జవాన్, జైకిసాన్’ను వాజపేయి మరింత ముందుకు తీసుకెళ్లి, ‘జై జవా న్, జై కిసాన్, జై విజ్ఞా న్’ అనే కొత్త నినాదం ఇచ్చారన్నారు. అదే దారిలో మోదీ ప్రభుత్వం రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి కృషి చేస్తోందని రాజ్‌నాథ్ చెప్పారు. దేశంలో అత్యధిక సంఖ్య లో రైతులే ఉన్నారని, అతిపెద్ద ఉత్పత్తిదారులు, వినియోగదారులు వారేనని ఆయన అన్నారు.