జాతీయ వార్తలు

సరిహద్దులు సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 9: సరిహద్దు భద్రత గతంలోకన్నా ఇప్పుడు మరింత పటిష్ఠంగా ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అక్రమ చొరబాట్లను ఆపటానికి సరిహద్దులను మరింత పటిష్ఠపరుస్తామని కూడా ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మోదీ ఫెస్ట్’ కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ‘గతంతో పోలిస్తే భారత దేశ సరిహద్దులు ఇప్పుడు మరింత సురక్షితంగా, భద్రంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు చెందిన ఏ పౌరుడు కూడా దేశంలోకి ప్రవేశించే వీలులేని విధంగా సరిహద్దులను అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని చెప్పారు.
గత ఏడాది నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం జరిపిన లక్షిత దాడులు అవసరమైతే భారతదేశం తన సరిహద్దులను దాటి సైతం దాడులు చేయగలదన్న బలమైన సందేశాన్ని ఇచ్చాయని హోం మంత్రి చెప్పారు.
‘ఉగ్రవాదులు పాకిస్తాన్‌నుంచి భారత్‌లోకి చొరబడి మన జవాన్లపై దాడి చేసి వారి ప్రాణాలను బలి తీసుకున్నారు. ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించిన తర్వాత సైన్యం విజయవంతంగా సర్జికల్ దాడులను నిర్వహించిందని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌పైకి మొదటి తూటాను పేల్చవద్దని, అయితే పాకిస్తాన్ గనుక మనపైకి మొదట కాల్పులు జరిపితే దీటుగా తిప్పి కొట్టాలని తాను సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా రాజ్‌నాథ్ చెప్పారు. ఇక్కడి ముహనా మండీలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ, దేశాభవృద్ధికోసం ప్రధాని నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలను చేపట్టారని, నవ భారత నిర్మాణమే లక్ష్యం గా పెట్టుకున్నారని చెప్పారు. ఇందుకు దేశ ప్రజలు ముఖ్యంగా యువత సహకారం అవసరమని అన్నా రు. ప్రభుత్వం యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ వారు సొంతంగా ఉపాధి పొందడానికి వీలుగా వారి నైపుణ్యాన్ని మెరుగుపరుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పా టు చేసి తక్కువ వడ్డీ రేట్లకు వారికి రుణాలు ఇస్తోందని చెప్పారు. 2019 నాటికి 5కోట్ల కుటుంబాలకు వం టగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం అనుకొంటోందని అన్నారు.

చిత్రం.. జైపూర్‌లో శుక్రవారం నిర్వహించిన ‘మోదీ ఫెస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్